పుష్ప-2 కోసం అన్ని కోట్లు తీసుకుంటున్న అల్లు అర్జున్..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులు ఎంతగా ఎదురుచూస్తున్న చిత్రం పుష్ప-2. ఈ సినిమాకి సంబంధించి గత ఏడాది నుంచి ఎన్నో కథలు ప్రచారంలో వినిపిస్తూనే ఉన్నాయి. అయితే పుష్ప-2 చిత్రానికి అల్లు అర్జున్ రెమ్యూనరేషన్ తో పాటు లాభాలలో వాటాలు తీసుకుంటున్నారని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. కానీ పుష్ప-2 కు మాత్రం అల్లు అర్జున్ రెమ్యూనరేషన్ రూ.100 కోట్ల రూపాయలు అన్నట్లుగా సమాచారం. ఈ సినిమాలలో అల్లు అర్జున్ కు 30% వాటా దక్కబోతున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి.

This unknown secret of 'Icon Star' Allu Arjun will surprise you!

ఇక హిందీ హక్కుల నుంచి కూడా భారీ మొత్తంలో వచ్చే అవకాశం ఉండడంతో ఈ స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నారు అల్లు అర్జున్ అనే వార్తలు చాలా వైరల్ గా మారుతున్నాయి. దీంతో అల్లు అర్జున్ కు ఏకంగా రూ.130 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చే అవకాశం ఉన్నట్లుగా ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ లెక్క ప్రకారం చూస్తే.. అల్లు అర్జున్ మొదటి స్థానం అని కామెంట్లు వినిపిస్తున్నాయి. బాహుబలి-2, కే జి ఎఫ్-2 లతో సక్సెస్ తరహాలోని పుష్ప -2 సినిమా సక్సెస్ సాధిస్తుందని అభిమానులు చాలా ధీమాగా ఉన్నారు.

అయితే ఇందులో కొంతమంది హీరోయిన్లు కూడా నటించబోతున్నారని వార్తలు వినిపించాయి.కానీ ఆ వార్తలు ఏ మాత్రం నిజం లేదని స్పష్టత వచ్చింది. పుష్ప-2 సినిమా బడ్జెట్ విషయంలో మైత్రి మూవీస్ వారు ఏమాత్రం రాజీ పడడం లేదు అనే వార్తలు తెగ వైరల్ గా మారుతున్నాయి. మరి పాన్ ఇండియా లెవెల్ లో విడుదల కాబోతున్న ఈ సినిమా పైన చిత్ర బృందం పలు జాగ్రత్తలు తీసుకొని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మరి ఈ సినిమా విడుదల సమయాన్ని ఇంకా ప్రకటించలేదు. హీరోయిన్గా రష్మిక నటిస్తోంది.

Share.