టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో వరస మరణాలు చోటు చేసుకుంటూ ఉండడం ఇండస్ట్రీ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. ఇప్పటికే తెలుగు సినీ పరిశ్రమలో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే కృష్ణంరాజు, కైకాల సత్యనారాయణ, చలపతిరావు, కృష్ణ వంటి దిగ్గజ నటుల మరణం మరువకముందే ఇప్పుడు మరొక నటుడు మరణించడం నిజంగా బాధాకరమని చెప్పవచ్చు. ఆయన ఎవరో కాదు వల్లభనేని జనార్ధన్ తాజాగా అనారోగ్యంతో కన్నుమూశారు. ఈయన కెరియర్ లో ఎన్ని సినిమాలు చేసినా విజయ బాపినీడు దర్శకత్వంలో చిరంజీవి హీరోగా వచ్చిన గ్యాంగ్ లీడర్ సినిమాలోని దుష్ట ఎస్పీ పాత్రకు గుర్తు తెచ్చుకోవాల్సిందే.
ఇకపోతే తన నటనతో విలనిజంతో ప్రేక్షకులను మెప్పించిన వల్లభనేని జనార్ధన్ విషయానికి వస్తే.. ఇకపోతే ఇప్పుడు ప్రేక్షకులు కూడా గుర్తుపట్టే విధంగా మరిచిపోలేని ఎన్నో పాత్రలు వేశాడు. జనార్ధన్ కేవలం నటుడు గానే కాకుండా నిర్మాతగా, దర్శకుడిగా, రచయితగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో పేరు గడించారు. ముఖ్యంగా ఈయనకు పిల్లనిచ్చిన మామ విజయ బాపినీడు దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటించిన గ్యాంగ్ లీడర్ సినిమాలో ఎస్పీ పాత్రలో నటించారు. ఈ చిత్రాన్ని హిందీలో ఆజ్ కా గూండారాజ్ పేరుతో రీమేక్ చేస్తే అక్కడ కూడా సంచలనం సాధించింది.
ఇకపోతే తెలుగులో దాదాపు 120 కు పైగా సినిమాలలో నటించిన జనార్ధన్ కాలేజీలో చదువుకునే సమయంలోనే నాటకాలలో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన గజదొంగ సినిమాకు దర్శకత్వ శాఖలో అప్రెంటిస్ గా కూడా పనిచేశారు. ఇక ఆస్తులపరంగా చూసుకుంటే సినిమా ఇండస్ట్రీకి రాకముందే వల్లభనేని జనార్ధన్ కుటుంబం బాగా సెటిల్ అయింది. ఈయన తాతగారు ఉమ్మడి ఏపీలోనే టాప్ ఫైవ్ బిజినెస్ మ్యాన్స్ లో ఒకరు. అలాగే ఆయన తాతగారు సంపాదించిన ఆస్తులు విలువ 400 కోట్ల రూపాయలు ఉంటుందని, తన తండ్రి సంపాదించిన ఆస్తి ఎంత ఉంటుందో చెప్పక్కర్లేదని ఆయన తెలిపారు మొత్తానికి అయితే తన తాతది, తన తండ్రి, తన ఆస్తి కలిపి సుమారుగా ఒక రూ.1500 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లు ఇప్పుడు వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి.