చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలో, బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి సినిమాలో హీరోయిన్గా శృతిహాసన్ నటించింది. ఈ రెండు చిత్రాలు ఒకేసారి సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలకు సిద్ధంగా ఉన్నది. ఇక ఇద్దరితో కలిసి బాగానే అలరించిన ఈ ముద్దుగుమ్మ ఈ సినిమాలలో గ్లామర్ లుక్ లో బాగా కనిపిస్తోంది. బాలయ్య, చిరంజీవి వయసు 60 సంవత్సరాలు పైనే ఉంటుంది.. దీంతో వీరిద్దరితో రొమాంటిక్ హీరోయిన్ గా నటించడంపై శృతిహాసన్ పై పలు రకాలుగా వార్తలు వినిపించాయి. ఈ వార్తలపై స్పందిస్తూ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది వాటి గురించి తెలుసుకుందాం.
శృతిహాసన్ మాట్లాడుతూ.. ఈమధ్య చాలామంది స్టార్స్ నటినటులకు సంబంధించిన వయసు గురించి మాట్లాడుతున్నారు. అయితే యాక్టింగ్ జీవితంలో వయసు అనేది కేవలం ఒక నెంబర్ మాత్రమే ఈ పరిశ్రమలో టాలెంట్ ఉన్నవారు పలు రకాలుగా జనాలలో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారే అంటూ తెలిపింది. ఇక అందమా ఏ వయసులో ఉండాల్సిన అందం ఆ వయసులో ఉంటుందని తెలివిగా సమాధానం చెప్పింది శృతిహాసన్. ఇక సినిమాలలో నటించడానికి వయసుతో సంబంధం లేదని కూడా తెలియజేసింది..
ఎందుకంటే నేను వచ్చిన మొదట్లో తనను ఎవరు పట్టించుకోలేదు. స్టార్ వయసు గురించి మాట్లాడుకుంటే అది అనవసరమైన చర్చ అని కూడా చాలా సున్నితంగా వివరించింది. చివరిగా శృతిహాసన్ ఎక్కువ వయసు ఉన్న వారితో నటించడానికి ఏమాత్రం అయిష్టం చూపకూడదని చెప్పకనే చెప్పేసింది శృతిహాసన్. సంక్రాంతి బరిలో నిలవనున్న వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి సినిమాలు శృతిహాసన్ కెరియర్ ని నిలబెడతాయేమో చూడాలి మరి.