బుల్లితెరపై చాలామంది యాంకర్స్ ఉంటారు. కానీ ప్రదీప్ లాంటి యాంకర్ మాత్రం ఒక్కరే ఉంటారని చెప్పవచ్చు.. ఎందుకంటే ప్రదీప్ ఏ షోలో అయినా అందరిని నవ్విస్తూ కనిపిస్తూ ఉంటారు. ప్రదీప్ యాంకర్ గానే కాకుండా హీరోగా కూడా 30 రోజుల్లో ఎలా ప్రేమిండం ఎలా అనే సినిమాలో నటించాడు. అభిమానులు సినీ ప్రేక్షకులు సైతం ప్రదీప్ వివాహం కోసం చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ప్రదీప్ పెళ్లి గురించి సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి . వీటి మీద స్పందించడం జరిగింది.
ప్రదీప్ స్పందిస్తూ.. తన పెళ్లి గురించి వచ్చే వార్తల్లో ఏమాత్రం నిజం లేదు అంటూ తేల్చి చెప్పారు. అయితే ఈ వార్త తాజగా సోషల్ మీడియాలో మళ్లీ వైరల్ గా మారుతోంది.. ప్రదీప్ ప్రముఖ డిజైనర్ నవ్య అనే అమ్మాయితో ప్రేమలో ఉన్నట్లుగా.. అలాగే తనని పెళ్లి చేసుకోబోతున్నట్లుగా వార్తలు వినిపించాయి. ఈ వార్తలు ఏమాత్రం నిజం కాదని..నేను షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్నాను. అయితే ఈ విషయంపై నేను చాలా లేటుగా స్పందించానని తెలిపారు.
అయితే ఆ అమ్మాయికి నాకు ఎలాంటి సంబంధం లేదు. నేను ఇంతవరకు ఆ అమ్మాయితో ఒక్కసారి కూడా మాట్లాడలేదు. ఇంతవరకు కలవటం కూడా జరగలేదు. అయితే మా టీమ్ వాళ్లు ఆ అమ్మాయితో మాట్లాడి ఉండవచ్చు. కానీ ఇప్పటివరకు తాను ఒక్కసారి కూడా తనతో మాట్లాడలేదని తనతో నా పెళ్లి అంటూ వచ్చే వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని కొట్టిపడేశాడు.ఈ సందర్భంలోనే ఆయన రెండో సినిమా తీయబోతున్నాడని వచ్చే ఏడాదికల్లా ఈ సినిమా విడుదల కాబోతున్నట్లు సమాచారం. కొత్త ఏడాది తన సినిమా గురించి తెలియజేస్తారేమో చూడాలి మరి.