తమిళ స్టార్ హీరో అజిత్ నటించిన తాజా చిత్రం తుణివు. అలాగే హీరో విజయ్ దళపతి నటించిన వారసుడు సినిమా సంక్రాంతికి విడుదల కాబోతున్నాయి. ఈ రెండు సినిమాల పైన ప్రేక్షకులకు భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఈ సినిమాల విడుదలకు సంబంధించి థియేటర్ విషయంలో పలు వివాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. వారసుడు చిత్రాన్ని నిర్మాత దిల్ రాజు వ్యవహరించారు. దీంతో దిల్ రాజు మాట్లాడుతూ తమిళనాడులో అజిత్ కంటే విజయ్ పెద్ద స్టార్ అని తెలిపారు. ఈ వ్యాఖ్యలపై త్రిష కూడా స్పందించింది.
త్రిష మాట్లాడుతూ నేను వ్యక్తిగతంగా నంబర్స్ గేమ్ ని నమ్మను.. ఇది మీ ఇంతకుముందు సినిమాకి జోడించే ట్యాగ్ మాత్రమే.. మీ చివరి చిత్రం మంచి విజయం సాధిస్తే మీరే నెంబర్ వన్ అవుతారు మీ సినిమా కొంతకాలం పాటు విడుదల కాకపోతే ఆస్థానంలో మరొకరు ఉంటారు. నేను పని చేయడం ప్రారంభించక ముందే.. వారు సినీ కెరియర్లో చాలా కాలంగా ఉన్నారు. వారి సినిమాలను ఆడియోస్గా చూశాను వారికి ఫ్యాన్స్ క్లబ్బులే ఉన్నారు. ఈ నెంబర్స్ గేమ్ మనమే ప్రారంభించినట్లు గా నేను భావించానని తెలుపుతోంది.
ఈ వ్యాఖ్యలు వివాదానికి దారి తీయడంపై దిల్ రాజు స్పందించారు.. తన మాటలను అపార్థం చేసుకున్నారని ఆ ఇంటర్వ్యూలో చాలా పెద్దగా ఉండగా అది కేవలం చిన్న భాగం మాత్రమే అని తెలిపారు. నేను సినిమాల ప్రేమికుడిని ఇప్పటివరకు 50 సినిమాలు చేశాను థియేటర్ సమస్య విషయంలో మాత్రమే విజయ్ గారు అజిత్ గారు రిఫరెన్స్ చేశాను కానీ దానికి బదులుగా మరేదో విషయం గురించి ప్రచారం చేస్తున్నారని తెలిపారు దిల్ రాజు.