టాలీవుడ్ లో కొన్ని చిత్రాలలో నటించిన శ్రీ రెడ్డి ఎప్పుడూ కూడా కాంట్రవర్సీ క్విన్ గా నిలుస్తూ ఉంటుంది. ఇప్పుడు తాజాగా మరొకసారి రానా సోదరుడు దగ్గుబాటి అభిరామ్ పైన పలు సంచలన వ్యాఖ్యలు చేస్తోంది. ఎప్పుడు కూడా నిరంతరం ఏదో ఒక వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. శ్రీరెడ్డి గతంలో కూడా ఒకసారి మా ఆఫీస్ ముందు అర్ధ నగ్న ప్రదర్శన చేసి బాగా ఫేమస్ అయ్యింది.
ఇక ఆ సమయంలోనే తనకు హీరోయిన్గా అవకాశాలు ఇస్తానని చెప్పి కొంతమంది స్టార్స్ తనని వాడుకున్నారని పెను సంచలనాన్ని సృష్టించింది. అందుకు సంబంధించిన ఆధారాలు కూడా తన దగ్గర ఉన్నాయని చెప్పి అందరిని భయభ్రాంతులకు గురిచేసింది. అయితే ఇప్పుడు తాజాగా ఒక ప్రకటన చేయడంతో పెను సంచలనంగా మారుతోంది. అదేమిటంటే నాయక్ రామ్ గూడ వద్దనున్న రామానాయుడు స్టూడియో ను రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కోసం నిర్మాత సురేష్ బాబు దానిని ఇచ్చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక అక్కడే ఈ స్టూడియో సమీపంలో ఉండడంతో అక్కడ అభివృద్ధి పనులు కూడా చాలా స్పీడుగా జరుగుతున్నట్లు తెలుస్తోంది.
అయితే ఈ స్టూడియోను రియల్ ఎస్టేట్ అభివృద్ధి కోసం ఇచ్చేయడంతో ఈ స్టూడియో కనుమరుగు కానున్న విషయం శ్రీ రెడ్డికి తెలిసిన వెంటనే రియాక్ట్ అయ్యింది.. ఈ విధంగా మాట్లాడుతూ..ఆ స్టూడియో కనుమరుగు ఎందుకు చేస్తున్నార్రా..? నాకు దగ్గుబాటి అభిరామ్ కు అక్కడే మొదటిసారి ఫస్ట్ నైట్ జరిగిందని తెలియజేస్తోంది.. ఇప్పుడు దానిని రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కోసం ఆ స్టూడియోను ఇలా చేస్తే ఎలా మా జ్ఞాపకాలు ఏమైపోవాలి అంటూ కామెంట్లు చేస్తోంది.