SSMB-28 లో కోలీవుడ్ హీరో.. ఏ పాత్ర కోసమంటే..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ సినిమాలో నటించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇటీవల సర్కారు వారి పాట సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకొని త్రివిక్రమ్ తో సినిమాని మొదలు పెట్టబోతున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన గత చిత్రాలు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం ఈ చిత్రంలో హీరోయిన్గా పూజా హెగ్డే నటిస్తోంది.అలాగే సెకండ్ హీరోయిన్ గా ఒక కుర్ర హీరోయిన్ ని ఎంపిక చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ సినిమా ఏప్రిల్ 28వ తేదీన విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. విడుదల సమయం ప్రకటించారు కానీ సమయానికి ఇంకా ఈ సినిమా షూటింగ్ పూర్తి కాలేదు. ఇప్పుడు తాజాగా ఈ సినిమా నుంచి మరొక అప్డేట్ వినిపిస్తోంది.ఈ సినిమాలో తమిళ హీరో భాగం కాబోతున్నారనే విషయం వైరల్ గా మారుతోంది. కోలీవుడ్లో యంగ్ హీరో విక్రమ్ ప్రభు ఈ సినిమాలో నటించే అవకాశం ఉన్నట్లుగా కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. తమిళంలో సోలో హీరోగా మాత్రమే నటించిన ఈ హీరో తెలుగు సినిమాలో సపోర్టింగ్ రూల్స్ లో సత్తా చటడానికి ప్రయత్నిస్తున్నారు.

Easier to work with actors who know Tamil: Vikram Prabhu

ఈ క్రమంలోనే మహేష్ సినిమాలో ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించబోతున్నట్లు సమాచారం. ఒకవేళ ఈ సినిమాలో విక్రమ్ ప్రభు నటిస్తే మహేష్ సినిమాకి తమిళంలో కూడా మంచి హైప్ రావడం ఖాయమని అభిమానులు భావిస్తున్నారు. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియాలి అంటే విషయంపై చిత్ర బృందం స్పందించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఎందుకు సంబంధించి ఈ విషయం మాత్రం చాలా వైరల్ గా మారుతోంది. మరి ఏ మేరకు ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి.

Share.