అందుకే ఆ నిర్మాతను కొట్టానంటున్న సీనియర్ నటి..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలుగులోనే కాకుండా ఇతర భాషలలో కూడా క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు చిత్రాలలో నటించి అందరికీ సుపరిచితురాలు అయ్యింది నటి రాధా ప్రశాంతి. ముఖ్యంగా కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఎన్నో చిత్రాలలో ఇమే విభిన్నమైన పాత్రలలో నటించి మెప్పించింది. చాలా కాలం నుంచి పెద్దగా కనిపించలేదు రాధా ప్రశాంతి. తాజాగా ఒక ప్రముఖ ఇంటర్వ్యూ చానల్లో పాల్గొంటూ తన సినీ కెరియర్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది.

Senior Actress Radha Prasanthi Open Up About Casting Couch - Sakshi

రాధా ప్రశాంతి మాట్లాడుతూ.. నేను ఒక సినిమాలో జమీందారు భార్యగా నటించాను ఆ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో ఒకరోజు అర్ధరాత్రి ప్రొడక్షన్ మేనేజర్ దగ్గర నుంచి తనకు ఫోన్ వచ్చిందని.. అయితే ఆ సమయంలో నేను కాకుండా మా సోదరుడు ఫోన్ లిఫ్ట్ చేశారని.. ఎవరు మాట్లాడుతున్నారని అడగగా.. పేరు చెబుతూనే ఫోన్ ఇస్తావా అంటూ చాలా కఠినంగా మాట్లాడారట.. ఆ తర్వాత రాధా ఫోన్ తీసుకొని మాట్లాడానని తెలిపింది. సినిమాకు సంబంధించిన ఒక విషయం మాట్లాడాలి గెస్ట్ హౌస్ కి రండి అని మేనేజర్ చెప్పారట. కానీ తన షెడ్యూల్ అయిపోయింది కదా ఆ సమయంలో ఎందుకని ప్రశ్నించానని చెప్పగా.. ఇక్కడ నిర్మాత, డైరెక్టర్ ,హీరో సిట్టింగ్ లో ఉన్నారు..మీరు కూడా రండి అని చెప్పారట.

కానీ చివరికి తన తమ్ముడితో కలిసి అక్కడికి వెళ్లానని తెలిపింది. అక్కడ వెళ్లిన తర్వాత వేరే ఆర్టిస్టుకు చేయబోయి మీకు చేశానని పక్కనే ఉన్న కొంతమంది చెప్పారట. దీంతో అక్కడి నుంచి తిరిగి వచ్చేసామని.. ఇక మరో షెడ్యూల్ సమయంలో పల్లెటూరులో పంచాయతీ సీను సంబంధించి షూటింగ్ జరుగుతూ ఉండగా నేను ఆక్కడే ఉన్న ఒక గదిలో వెళ్లి బట్టలు మార్చుకుంటూ ఉండగా ఆ మేనేజర్ నన్ను చూడడం జరిగింది. ఆడవాళ్లు బట్టలు మార్చుకుంటుంటే మీరు గదిలో రావడమేంటి అని నేను కోపంగా అతడిని అరిచాను.. అప్పుడు గెస్ట్ హౌస్ లో అలా ప్రవర్తించి ఇప్పుడు ఇలా చేయడంతో ఒక్కసారిగా కోపం వచ్చిందని తెలిపింది. దాంతో వాడి చెంప చెల్లుమనిపించానని.. అయితే.. ఇప్పుడు ఆ మేనేజర్ ప్రముఖ నిర్మాతగా కొనసాగుతున్నారని రాధా ప్రశాంతి తెలిపారు.

Share.