మహేష్ బాబు కెరియర్ లోనే ఒక మైలురాయిగా నిలిచిన చిత్రాలలో ఒక్కడు సినిమా కూడా ఒకటి. ఈ సినిమా మహేష్ బాబును మాస్ ఇమేజెస్ తెచ్చి పెట్టింది. అయితే ఈ సినిమా కథ మొదట మహేష్ బాబు దగ్గరికి రాకముందే ఎంతో మంది హీరోల దగ్గరకు వెళ్లినట్లుగా తెలుస్తోంది. అయితే కొంతమంది హీరోలు కొన్ని సినిమాలు మాత్రమే సెట్ అవుతాయి అనేదానికి ఈ సినిమా ఉదాహరణ అని చెప్పవచ్చు. అలా వచ్చిన అవకాశాన్ని వదులుకున్న స్టార్ హీరోల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఒక్కడు సినిమాని ముందుగా గుణశేఖర్ ప్రభాస్ కి చెప్పగా.. వదులుకోవడంతో ఈ సినిమా మహేష్ బాబు చేతికి రావడం జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే మహేష్ బాబుకి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన ఈ చిత్రం లో కనిపించిన చార్మినార్ సెట్ కోసం అప్పట్లో భారీగానే ఖర్చు చేశారని వార్తలు వినిపించాయి. హీరోగా మహేష్ బాబు, విలన్ గా ప్రకాష్ రాజ్ చాలా అద్భుతమైన నటన ప్రదర్శించారు. హీరోయిన్గా భూమిక ఇందులో నటించింది. ఇక డైరెక్టర్ గుణశేఖర్ ఈ సినిమాని తెరకెక్కించి పలు రికార్డులను సైతం క్రియేట్ చేశారు
ఇక తర్వాత వీరిద్దరి కాంబినేషన్లు అర్జున్ సినిమా విడుదల కాక ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అద్దెకుంది. అయితే మొదట ఈ సినిమాని ప్రభాస్ కోసం కథ రాసి ప్రభాస్ దగ్గరికి వెళ్ళగా కృష్ణంరాజుకు కూడా ఈ సినిమా కథ నచ్చిందట. కానీ స్పోర్ట్స్ బ్యాక్ గ్రౌండ్ మూవీ కావడం కొన్ని మార్పులు చేయమని చెప్పడంతో ఈ సినిమా కథ దెబ్బతింటుందని డైరెక్టర్ గుణశేఖర్ ప్రభాస్ ని రిజెక్ట్ చేశారు. ఆ తర్వాత నితిన్ కు, పవన్ కళ్యాణ్ కు , రవితేజకు తదితర హీరోలకు చెప్పగా రిజెక్ట్ చేశారట. ఇక ఈ కథ మహేష్ కు చెప్పగా కథ నచ్చడంతో ఓకే చెప్పడంతో తెరకెక్కించి మంచి విజయాన్ని అందుకున్నారు.