RRR చిత్రంతో పాన్ ఇండియా హీరోగా పేరుపొందిన రామ్ చరణ్ తన తదుపరి చిత్రాలను చాలా స్పీడుగా చేసేస్తున్నారు. దర్శకుడు శంకర్ తో తన RC -15వ సినిమాను చేస్తూ ఉండగానే మరొకవైపు ఉప్పెన సినిమా బుచ్చిబాబుతో ఒక సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇప్పుడు తాజాగా మరొక క్రేజీ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఆ సినిమా కూడా పాన్ ఇండియా స్థాయిలో UV క్రియేషన్ బ్యానర్లు నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం రామ్ చరణ్ డైరెక్టర్ శంకర్ తో RC -15 చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం ఒక పొలిటికల్ యాక్షన్ త్రిల్లర్ చిత్రంగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా పీరియాడిక్ అంశాలు ఎక్కువగా ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో కీరా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది. ఇక అంజలి సునీల్, దిల్ రాజు తదితరులు కూడా ఇందులో నటిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రం అయిపోయిన వెంటనే బుచ్చిబాబు దర్శకత్వంలో మైత్రి మూవీస్ వారు నిర్మిస్తున్న ఒక సినిమాకి సంబంధించి ఇటీవల ఒక అధికారికంగా ప్రకటన వెలబడింది.
ఈసారి తెలుగు డైరెక్టర్ కాకుండా ఏకంగా కన్నడ డైరెక్టర్ కి ఓకే చెప్పినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. కన్నడలో మఫ్టీ మూవీ తో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న నర్తన్ స్టోరీని రామ్ చరణ్ ఓకే చెప్పినట్లుగా సమాచారం. ఈ సినిమాకి సంబంధించి ఇంకా అధికారికంగా ప్రకటన అయితే రాలేదు. కానీ ఈ సినిమా కూడా భారీ యాక్షన్ డ్రాప్ లో ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా స్క్రిప్ట్ కోసం డైరెక్టర్ నర్తన్ పనిలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ డైరెక్టర్ గతంలో హీరో యష్ తో ఒక సినిమాని తీసినట్లు తెలుస్తోంది.