ప్రస్తుతం యంగ్ హీరోలలో పాన్ ఇండియా లెవెల్ లో మంచి పాపులారిటీ సంపాదించిన హీరో అడవి శేషు ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఎన్నో వైవిధ్యమైన చిత్రాలలో నటించి, విభిన్నమైన పాత్రల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు. డిసెంబర్ 2న విడుదలైన హిట్ -2 సినిమా మంచి విజయం సాధించింది. ఇక గత అన్ని చిత్రాలు కూడా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాయి. ముఖ్యంగా అడవి శేషు ఎంచుకొని కథలు, అతని స్టైల్ , యాటిట్యూడ్ ప్రతి ఒక్కరిని కూడా ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది.
ఇక అడవి శేషు వివాహం గురించి ఇప్పటివరకు ఏ విషయాన్ని తెలుపలేదు. పెళ్లి ప్రస్తావన వస్తే చాలు దాటేస్తూ ఉంటారు. తాజాగా అడవి శేషు అక్కినేని కుటుంబం క్రిస్మస్ వేడుకలలో పాల్గొని ప్రతి ఒక్కరికి ఆశ్చర్యాన్ని కలిగించేలా చేశారు. అక్కినేని ఫ్యామిలీ నేటి తరం నటులు అఖిల్, సుశాంత్ ,సుమంత్ ,సుప్రియ మరికొందరి సభ్యులతో కలిసి కొన్ని ఫోటోలను షేర్ చేయడం జరిగింది దీంతో అడవి శేషు అభిమానులు అక్కినేని ఫ్యామిలీలో కలిసిపోయారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అడవి శేషు తన ప్రేమ పెళ్లి గురించి తెలియజేయునప్పటికీ ఇతని పైన మాత్రం ఇలాంటి రూమర్స్ వస్తూనే ఉన్నాయి.
అడవి శేషు ఒక లేడీ ప్రొడ్యూసర్ రిలేషన్ షిప్ లో ఉన్నారంటూ ఆ మధ్య ప్రచారం ఎక్కువగా జరిగింది. దీంతో అడవి శేషు అక్కినేని ఫ్యామిలీ వేడుకలలో సుప్రియ పక్కన ఉండడం ప్రతి ఒక్కరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అఖిల్ ఈ ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేశారు అక్కినేని కజిన్స్ అని కామెంట్స్ కూడా పెట్టడం జరిగింది. దీంతో అడవి శేషుకి అక్కినేని కజిన్స్ ఎలా అవుతారు ఏదో ఒక రిలేషన్ ఉంటేనే కదా కజిన్ అవుతారు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ విషయం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతోంది.
View this post on Instagram