టాలీవుడ్ లో ఒకప్పటి హీరోయిన్ ఆర్తి అగర్వాల్ ఈమె గురించి పెద్దగా పరిచయం చేయనవసరం లేదు. మొదటి సినిమా వెంకటేష్ తో మొదలుపెట్టి చాలా అవకాశాలను అందుకుంది.ఆ సినిమానే నువ్వు నాకు నచ్చావ్ ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను సాధించింది. నువ్వు నాకు నచ్చావ్ సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆర్తి అందరికీ తెగ నచ్చేసింది. ఆ తరువాత అదే బ్యానర్లు నువ్వు లేక నేను లేను సినిమా తీసింది. ఆ సినిమా కూడా సూపర్ హిట్ కావటంతో స్టార్ హీరోయిన్గా పేరుపొందింది.
ఇక అలా అగ్ర హీరోలతో సినిమాలు చేసి ఒక బ్రాండ్ ను సంపాదించుకుంది. మెగాస్టార్ తో ఇంద్ర, ప్రభాస్ తో అడవి రాముడు, మహేష్ బాబుతో బాబి, ఉదయ్ కిరణ్ తో నీ స్నేహం, రవితేజ తో వీడే, ఆ తరువాత సునీల్ తో అందాల రాముడు సినిమా తీసింది. ఇలా అప్పట్లో ఏన్నో సినిమాలలో నటించే అవకాశం అందుకుంది.ఇలా సినిమాలతో బిజీగా ఉన్న ఆర్తి..టాలీవుడ్ యంగ్ హీరోతో ప్రేమలో పడింది. అతనిని ఆర్తి ఎంతో ప్రేమించి తనే సర్వస్వం అనుకుంది. ఆ హీరోని పెళ్లి చేసుకోబోతుందని ప్రచారం జరిగింది. కానీ ఆ హీరో ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోవటంతో పాటు బెదిరించారనే వార్తలు కూడా వినిపించాయి.. ఇలా అతనిపై ప్రేమతో మనస్థాపానికి గురైన ఆర్తి అగర్వాల్ సినిమాల మీద ఫోకస్ చేయలేకపోయింది. ఓ సందర్భంలో సూసైడ్ చేసుకోవాలని ప్రయత్నించింది.
ఒకప్పుడు ఆర్తి అగర్వాల్ చాలా సన్నగా చూడడానికి అందంగా ఉండేది. అలాంటి హీరోయిన్ ఉన్నట్టుండి బొద్దుగా తయారవ్వడంతో లైపో సర్జరీ చేయించుకుందని సమాచారం.ఆ సమయంలో ఆరోగ్యం దెబ్బతిని అకస్మాత్తుగా మృతి చెందిందని వార్తలు వినిపించాయి.. అయితే అగర్వాల్ కెరీర్ ఇలా ఉన్నట్టుండి ముగిసిపోవటానికి కారణం ఆ హీరోనే కారణమని చెబుతూ ఉంటారు.. కానీ ఆ హీరో కూడా ప్రస్తుతం పెడవుట్ హీరోగా మారిపోయారు.