నిర్మాతగా ఉండి ఆస్తులన్నీ అమ్ముకుంటున్న స్టార్ హీరో..!!

Google+ Pinterest LinkedIn Tumblr +
టాలీవుడ్లో సుమంత్ ఆర్ట్స్ ప్రొడక్షన్ నుంచి అప్పట్లో ఒక్కడు, వర్షం, నువ్వు వస్తానంటే నేనొద్దంటానా వంటి చిత్రాలు విడుదలై మంచి విజయాలను అందుకున్నాయి. నిర్మాత అంటే కేవలం పెట్టుబడులు పెట్టడమే కాకుండా సినిమా అభిరుచి కూడా ఉండాలి అనే విధంగా మంచి సినిమాలను తెరకెక్కించారు ఎమ్మెస్ రాజు. సినిమా కథలు తయారుచేసుకొని మరి ఆయన సినిమాలు తీశారు అంటే ఆయనకు సినిమాలంటే ఎంత ఇష్టమో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
Hero Sumanth Ashwin Photos - Lovely Telugu
ఇక ఎమ్మెస్ రాజు కొడుకు సినీ రంగంలోకి అడుగుపెట్టారు. ఆయనే నటుడు సుమంత్ అశ్విన్. మొదట తూనీగ తూనీగ సినిమాలో నటించగా బాగానే ఆకట్టుకుంన్నారు. ఆ తర్వాత కేరింత సినిమాతో బాగా పాపులర్ అయ్యారు. ఈ రెండు సినిమాలు తప్ప తన కెరియర్ల పెద్దగా హిట్ అయిన సినిమాలు ఏవి లేవు. ఎమ్మెస్ రాజు ఎంతోమంది హీరోలను సూపర్ స్టార్ గా మార్చారు కానీ తన కుమారుని మాత్రం మార్చలేకపోయారు.
ఎమ్మెస్ రాజు వాన సినిమానీ తీసి భారీ నష్టాన్ని చవితెచ్చుకున్నారు. అలా కొన్ని సినిమాలు తీసి నష్టాలు పాలు కావడంతో చెన్నైలో ఉన్న కొన్ని ఆస్తులను అమ్ముకోవాల్సి వస్తోందని ఆయన కుమారుడు సుమంత్ అశ్విన్ ఒక ఇంటర్వ్యూ తెలియజేయడం జరిగింది. ఎమ్మెస్ రాజ నిర్మాణ సామర్థ్యంలో ఎంతో మంది హీరోలు నటించారు.. వాళ్లంతా సుమంత్ సినిమాలను ప్రమోషన్స్ చేసి ఉంటే కొంతైనా తమ సినిమాలకు హైప్ ఉంటుందనే ప్రశ్న సుమంత్ ని అడగగా.. అందుకు సుమంత్ సమాధానం చెబుతూ.. రామ్ చరణ్ తో సినిమా చేయకపోయినా ఆయన సినిమా ప్రమోషన్ చేశారని.. మహేష్ బాబును మాత్రం అడగలేదని ఒకసారి అడిగితే ఆయన యూరప్ ట్రిప్పు వల్ల రాలేదని తెలిపారు సుమంత్. వెంకటేష్ కూడా తమ సినిమా ప్రమోషన్ చేశారని తెలిపారు. కానీ అదృష్టం కలిసి రాలేదని సుమంత్ కి చెప్పవచ్చు.
Share.