టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా పేరు పొందింది హీరోయిన్ శృతిహాసన్. మొదట ఐరన్ లెగ్గుగా పేరుపొందిన ఈమె గబ్బర్ సింగ్ సినిమాతో గోల్డెన్ లెగ్గుగా పెరు సంపాదించింది. ముఖ్యంగా అప్పుడప్పుడు తమ బాయ్ ఫ్రెండ్ లతో కలిసి ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ పలు సంచలనాలను సృష్టిస్తూ ఉంటుంది. వాస్తవానికి ఈమె కమలహాసన్ కూతురు అయినప్పటికీ కూడా ఈమె తన సినీ బ్యాగ్రౌండ్ ఉపయోగించకుండా కేవలం తన సొంతగానే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిందని చాలాసార్లు తెలియజేస్తూ ఉంటుంది.
ఇక శృతిహాసన్ తెలుగు, తమిళ్ వంటి భాషలలో కూడా పలు సినిమాలలో నటిస్తోంది. తాజాగా చిరంజీవితో నటించిన వాల్తేర్ వీరయ్య, బాలకృష్ణతో నటించిన వీర సింహారెడ్డి సినిమాలు సంక్రాంతికి విడుదల కాబోతున్నాయి. అలాగే ప్రభాస్ తో కలిసి సలార్ సినిమాలో నటిస్తోంది. ఈ మూడు చిత్రాల పైన భారీగానే ఆశలు పెట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శృతిహాసన్ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది.
శృతిహాసన్ మాట్లాడుతూ ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో తన హైట్ గురించి ఎక్కువగా మాట్లాడుకునే వారిని.. కొందరైతే ఇంత ఎత్తు ఉన్నావేంటి నీ హైటే నీకు మైనస్ అంటూ కామెంట్స్ చేసే వారట.. అలాంటి కామెంట్స్ ఒకానొక సమయంలో తనని చాలా బాధించేవని అయితే ఆ తర్వాత హైట్ తనకు ప్లస్ అయిందని గ్రహించానని తెలిపింది శృతిహాసన్. తెలుగులో మహేష్ బాబు, ప్రభాస్ వంటి హీరోల పక్కన నటించే అవకాశం రావడం కేవలం హైట్ వల్లే జరిగిందని తెలుపుతోంది. అయితే తనలో కూడా కొన్ని బలహీనతలు ఉన్నాయని వాటిని ఎప్పటికప్పుడు చక్కదిద్దుకుంటూ ముందుకు వెళుతున్నానని తెలియజేస్తోంది.
గడిచిన కొద్ది సంవత్సరాల క్రితం సినిమాలలో అసలు నటించలేదు.దీంతో తన క్రేజ్ పడిపోయిందని మళ్ళీ మొదటి నుంచి తన సినీ యాక్టింగ్ మొదలు పెట్టానని అప్పుడు చాలా ఇబ్బందులు కూడా పడ్డానని తెలియజేస్తోంది.