ఈ స్టార్ హీరోల మాస్టర్ ప్లాన్ అదిరిందిగా..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలీవుడ్లో హీరోలకి ఎంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ముఖ్యంగా సీనియర్ హీరోలైన చిరంజీవి ,బాలకృష్ణ అభిమానుల సంఖ్య ఇప్పటికి పెరుగుతూనే ఉన్నారని చెప్పవచ్చు. వీరిద్దరి సినిమాలు విడుదలవుతున్నాయి అంటే చాలు అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తుంటారు. అలాంటిది ఇద్దరు హీరోల సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడితే ఇక అభిమానులలో ఏ లెవెల్ లో పోటీ ఉంటుందో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు సంక్రాంతి బరిలో బాలయ్య వీరసింహారెడ్డి చిరంజీవి వాల్తేర్ వీరయ్య సినిమాలు ఎంట్రీ ఇవ్వబోతున్నాయి. తాజాగా ఈ సినిమాల గురించి ఒక క్రేజీ న్యూస్ వైరల్ గా మారుతుంది వాటి గురించి తెలుసుకుందాం.

Decisive Balayya Ambivalent Chiru

బాలకృష్ణ చిత్రాన్ని డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్గా శృతిహాసన్ నటించింది.శరత్ కుమార్, దునియా విజయ్ తదితరులు కీలకమైన పాత్రలో నటిస్తున్నారు.ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా 12వ తేదీన విడుదల తేదీని ప్రకటించారు. ఇందులో భాగంగా ఈ సినిమా నుంచి పలు అప్డేట్లు విడుదల చేస్తూ అభిమానులను ఖుషి చేస్తున్నారు.

Waltair Veeraya & Veerasimha: That's The Public Mood

మరొకవైపు చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాని డైరెక్టర్ బాబి దర్శకత్వం వహించారు. ఇందులో కూడా హీరోయిన్ గా శృతిహాసన్ నటిస్తోంది. అలాగే కీలకమైన పాత్రలో రవితేజ నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని కూడా మైత్రి మూవీ మేకర్స్ వారే నిర్మిస్తున్నారు. దాదాపుగా 22 ఏళ్ల తర్వాత రవితేజ తో కలిసి చిరంజీవి నటిస్తున్నారు ఈ సినిమా సంక్రాంతి 13వ తేదీన విడుదల కాబోతోంది.

అయితే ఈ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడుతున్న సమయంలో ఇప్పుడు తాజాగా వీరసింహారెడ్డి ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను ఒంగోలులో జనవరి 6వ తేదీన ప్రకటించారు. ఈవెంట్ కి చిరంజీవి ముఖ్య అతిథిగా రాబోతున్నారు. ఇక చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు బాలయ్య అతిధిగా రాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.

Share.