బాలయ్య యాంకర్ గా చేస్తున్న షో ఆన్ స్టాపబుల్. ఇక ఇందులో వచ్చే నటీనటులు, పొలిటిషన్స్ వారి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెబుతుంటారు. ఈ కార్యక్రమం ఇప్పటికే సీజన్-1 పూర్తి చేసుకొని సీజన్ 2 ప్రసారమవుతోంది. అయితే ఇప్పటికే ఈ సీజన్లో ఆరు ఎపిసోడ్లు పూర్తి చేసుకుంది. అయితే ఆరో ఎపిసోడ్ భాగంగా సీనియర్ హీరోయిన్స్ అయినా జయప్రద, జయసుధ ఇద్దరితోపాటు రాశి ఖన్నా కూడా ఈ షోకి హాజరయ్యారు.
ఈ ముగ్గురు హీరోయిన్స్ ఈ కార్యక్రమంలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు బాలకృష్ణకు వెల్లడించారు. బాలకృష్ణ వీరి జీవితంలో జరిగిన చేదుఅనుభవాల గురించి అడిగి తెలుసుకున్నారు. ముందుగా ఈ కార్యక్రమంలో జయప్రద గురించి కొన్ని చేదు అనుభవాల గురించి గుర్తుచేసుకోని బాధపడింది. సినీ రంగంలో చాలా పాపులారిటీని సంపాదించుకున్న జయప్రద రాజకీయాల్లోకి వెళ్లాక అక్కడికి ఎందుకు వెళ్లాను అనే ఆలోచన వచ్చిందట.అంతేకాకుండా కొన్ని కొన్ని సందర్భాల్లో చాలా బాధపడ్డానని రాజకీయాల్లో ఉన్న సమయంలో నన్ను చాలామంది చంపేస్తామని బెదిరించారని జయప్రద చెప్పుకొచ్చింది. అంతేకాకుండా యాసిడ్ తో దాడి చేస్తామంటూ బెదిరించారట. ఇలా అప్పటి సంఘటనలను గుర్తు చేసుకుంటూ బాధపడుతోంది జయప్రద
ఇక 2019లో ఎన్నికల సమయంలో బయటకి ప్రచారం కోసం వెళ్ళినప్పుడు ఈ దాడి జరిగిందని ఆ సమయంలో నన్ను అందరూ చుట్టుముట్టారు ఆ టైంలో నాకు భయం వేసింది. అయితే ఇలా బయటకు వచ్చిన ప్రతిసారి ఇంటికి వెళ్తాను వెళ్ళను అనే సందేహం తనకు ఉండేదట.ఈ సందర్భంగా జయప్రద అప్పటి చేదు సంఘటనల గురించి ఈ షో ద్వారా ప్రేక్షకులకు తెలియజేసింది. ఈమె చేసిన ఈ ఆసక్తికరమైన విషయాల గురించి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. చెప్పాలంటే చాలామందికి రాజకీయాల్లోకి వెళ్లాక ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. దీంతో జయప్రద అభిమానులు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.