ప్రస్తుతం సినీ ప్రియుల అభిరుచి ఒక్కసారిగా మారిపోయిందని చెప్పవచ్చు. ఎక్కువగా ఓటీటి లోనే పలు సినిమాలు చూడడానికి మక్కువ చూపుతున్నారు. పాన్ ఇండియా సాంస్కృతి ప్రభావంతో దర్శకులు హీరోలు పలు ఆలోచనలు పూర్తిగా మార్చేస్తున్నాయి. ముఖ్యంగా కథానాయకుడు అంటే పలానా రూల్స్ కి కట్టుబడి ఉండాలని వాటిని చెరిపేశారు. కథ బాగుంటే ఎలాంటి వారైనా సక్సెస్ అవుతారని కొన్ని చిత్రాలు ఇదివరకే ప్రూఫ్ చేశాయి. అలా ఏడాది హీరోలుగా మెప్పించిన కొంతమంది హీరోలు విలన్లుగా నటించారు వాటి గురించి చూద్దాం.
1). సత్యదేవ్:
పలు చిత్రాలలో హీరోగా నటించిన ఈ నటుడు చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమాలో విలన్ గా నటించారు. ఈ చిత్రంలో సత్యదేవ నటన అద్భుతంగా ఆకట్టుకుంది.
2). ఆది పినిశెట్టి:
హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన సహాయాన్ని సంపాదించుకున్న ఆదిపినిశెట్టి ఇప్పటివరకు వైర్యం ధనుస్ గా సరైనోడు చిత్రంలో అదరగొట్టేశాడు. ఇక తర్వాత రామ్ పోతినేని నటించిన ది వారియర్ చిత్రంలో మరొకసారి విలన్ గా అద్భుతమైన నటన ప్రదర్శించారు.
3). హీరో సూర్య:
ఏడాది బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న మొదటి చిత్రంలలో విక్రమ్ సినిమా కూడా ఒకటీ .ఈ చిత్రంలో కమల్ హాసన్ ,విజయ్ సేతుపతి, సూర్య, పహాడ్ ఫాసిల్ ఇలా అద్భుతమైన ప్రదర్శించారు. ఇందులో సూర్య విలన్ గా కూడా కనిపించి ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నారు.
4). కార్తికేయ:
నాచురల్ స్టార్ నాని నటించిన గ్యాంగ్ లీడర్ సినిమాలో మొదటిసారిగా విలన్ గా నటించారు ఆర్ఎక్స్ 100 హీరో కార్తికేయ. ఇక ఆ తర్వాత కోలీవుడ్లో అజిత్ నటించిన వలిమై చిత్రంలో కూడా విలన్ గా నటించారు.
5). దగ్గుబాటి రానా:
పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమాలో రానా విలన్ గా నటించి బాగా ఆకట్టుకున్నారు.
మరి రాబోయే రోజుల్లో మరి కొంతమంది హీరోలు విలన్గా అదరగొడతారేమో చూడాలి.