హీరో రవితేజ నటించిన తాజా చిత్రం ధమాకా. ఈ చిత్రంలో హీరోయిన్గా శ్రీ లీల నటించింది. ఈ సినిమా ప్రస్తుతం సక్సెస్‌ఫుల్‌గా థియేటర్లలో రన్ అవుతోంది .మొదటి రోజు రూ .5 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లు సాధించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన శ్రీ లీల క్రేజ్ మాత్రం భారీగా పెరిగిపోయిందని చెప్పవచ్చు.ముఖ్యంగా మాస్ ప్రేక్షకులు శ్రీలీల డ్యాన్సులకు ఫిదా అవుతున్నారు. శ్రీలీల భవిష్యత్తు ప్రాజెక్టులలో కూడా మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా నటించిందని చెప్పవచ్చు.
శ్రీ లీల కెరియర్ ను ఏవిధంగా ప్లాన్ చేసుకుంటుందో తెలియాల్సి ఉంది. శ్రీ లీల రెమ్యూనరేషన్ కూడా కోటి రూపాయలు మాత్రమే కాకుండా చాలా మంది యంగ్ హీరోయిన్లులలో మొదటి స్థానంలో ఉందని చెప్పవచ్చు. కుర్ర హీరోలు కూడా ఈమెకి అవకాశం ఇస్తూ ఉండడం ఈమెకు బాగా కలిసి వస్తుందని చెప్పవచ్చు.. ఈ ముద్దుగుమ్మకు సోషల్ మీడియాలో కూడా విపరీతమైన క్రేజ్ ఉంది ధమాకా మూవీ మొదటి రోజు ఊహించని స్థాయిలో కలెక్షన్లను సాధించడంతో ధమాకా సినిమా సక్సెస్ భాగంలో ఈమె కూడా భాగస్వామ్యం అయిందని చెప్పవచ్చు.
శ్రీ లీల సరైన ప్రాజెక్టులను ఎంచుకుంటే స్టార్ హీరోయిన్ స్టేటస్‌ను అందుకోవడం పెద్ద విషయం ఏమి కాదని అభిమానులు భావిస్తున్నారు. చిన్న వయసులోనే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ఇంతటి స్టార్డం అందుకున్న ఈ ముద్దుగుమ్మ మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న సినిమాలు అవకాశం దక్కిందంటే చాలు ఈమె స్టార్డం మరింత పాపులర్ అవుతుందని అభిమానులు భావిస్తున్నారు. ముఖ్యంగా ఈ పూజా హెగ్డే అని డామినేషన్ చేసే పాత్ర కావడంతో ఈ సినిమాలో కచ్చితంగా నటిస్తే బాగుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు. దీంతో మాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈ ముద్దుగుమ్మ హీరోయిన్ల జాబితాలో చేరిపోయినట్లే అని తెలుస్తోంది.