స్టార్ డైరెక్టర్లలో ఒకరైన సుకుమార్ ప్రస్తుతం పుష్ప సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్‌గా పేరుపొందారు. అల్లు అర్జున్‌తో తెరకెక్కించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా పలు రికార్డులను సృష్టించింది. ఉత్తరాది ప్రేక్షకులతో పాటు ఇతర భాషలలోని ప్రేక్షకులను మెప్పించడం సక్సెస్ కావడంతో పుష్ప సినిమా సీక్వెల్ పైన మరింత దృష్టి పెట్టారు సుకుమార్. ప్రస్తుతం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కాబోతున్నట్లు తెలుస్తోంది. జనవరి ఫస్ట్ వీకెండ్ నుంచి ఈ సినిమా తదుపరి షెడ్యూల్ ప్రారంభం కాబోతున్నట్లు సమాచారం.
ఇదంతా ఇలా ఉండగా ఈ సినిమా తర్వాత అత్యంత భారీ స్థాయిలో విజయ్ దేవరకొండ తో సుకుమార్ ఒక భారీ హిస్టారికల్ చిత్రాన్ని తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నట్లు గతంలో వార్తలు వినిపించాయి. తెలంగాణలోని ఖాశీంరజ్వీ రజాకర్ పాలనకు వ్యతిరేకంగా జరిగిన రైతాంగ సాయుధ పోరాటం నేపథ్యంలో ఈ సినిమాని తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. ఇందుకోసం పలు పుస్తకాలను కూడా సుకుమార్ చదివారట వాటి ఆధారంగానే విజయ్ దేవరకొండ తో సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ ప్రాజెక్టు ప్రకటించి ఇప్పటికీ ఎన్నో ఏళ్లు గడుస్తున్న ఇప్పటివరకు ఈ సినిమా గురించి ఎలాంటి అప్డేట్ లేదు.
కేవలం సుకుమార్ పుష్ప-2 సినిమా షూటింగ్‌లోని బిజీగా ఉండడం వల్ల ఈ ప్రాజెక్టు ఎప్పటికప్పుడు లేటవుతుంది వార్తలు వినిపిస్తున్నాయి. విజయ్ దేవరకొండ ప్రస్తుత పరిస్థితి కూడా చాలా భిన్నంగా ఉందని చెప్పవచ్చు. దీంతో ఈ సినిమా మరింత ఆలస్యం కావడానికి కారణం అవుతోందని వార్తలు వినిపిస్తున్నాయి.. పుష్ప సినిమా తర్వాత సుకుమార్ రామ్ చరణ్ తో ఒక క్రేజీ సినిమాకు సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో 2024 వరకు ఖాళీగా లేకపోవడంతో విజయ్ దేవరకొండ సినిమా ఉంటుందా లేదా అని అభిమానులు చాలా సందేహంగా తెలియజేస్తున్నారు. ప్రస్తుతం విజయ్ ఖుషి అనే చిత్రంలో నటిస్తున్నారు.