Tamannaah ప్రస్తుతం హీరోయిన్ తమన్నా వయసు 35 సంవత్సరాలు ఇప్పటికీ ఇమే ఇంకా వివాహం చేసుకోకుండా చేతినిండా పలు సినిమాలతో బిజీగా ఉంటోంది .కానీ అనుకున్నంత స్థాయిలో ఇమే సినిమాలు సక్సెస్ కాలేకపోతున్నాయి. ఇటీవల తన పుట్టినరోజు వేడుకలను చాలా ఘనంగా జరుపుకున్న తమన్నా తన కెరీర్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేయడం జరిగింది వాటి గురించి తెలుసుకుందాం.
సౌత్ సినీ సినీ ఇండస్ట్రీలో అగ్ర కథానాయకగా ఉన్న తమన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి.. అందం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమెను ముద్దుగా ఆమె అభిమానులు మిల్కీ బ్యూటీ అని పిలుచుకుంటూ ఉంటారు. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ వంటి భాషలలో ఎన్నో చిత్రాలలో నటించి దాదాపుగా 20 సంవత్సరాలుగా స్టార్ హీరోయిన్గా కొనసాగుతూనే ఉన్నది. ఇటీవలే బబ్లీ బౌన్సర్, F-3 వాటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పెద్దగా ఆకట్టుకోలేకపోయినట్లు సమాచారం. ప్రస్తుతం చిరంజీవితో కలిసి భోళా శంకర్ సినిమాలు నటిస్తున్నది. ఈ సినిమా షూటింగ్ కూడా చాలా వేగంగా జరుపుకుంటుంది ఇందులో కీర్తి సురేష్ చిరంజీవి చెల్లెలుగా కనిపించబోతోంది.
తమన్నా మాట్లాడుతూ తాను ముంబైలో చదువుకుంటున్న సమయంలో సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చాను. అప్పుడు తన వయసు కేవలం 15 సంవత్సరాలు మొదటిసారిగా సాంద్ సా రోషన్ షహనా అని హిందీ చిత్రంలో నటించారని అదే తొలి సినిమా కానీ ఫ్లాప్ అయిందని ఇక అదే ఏడాది మంచు మనోజ్ తో శ్రీ చిత్రం ఆఫర్ వచ్చిందని..కానీ అది కూడా సక్సెస్ కాలేదని దీంతో తన పని అయిపోయిందని అలాంటి సమయంలోనే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో హ్యాపీడేస్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ఈ సినిమా అనుకున్నంత స్థాయి కంటే ఎక్కువ విజయాన్ని అందించింది. ఆ తర్వాత ఎన్నో సినిమాలలో నటించాను పలు స్పెషల్ సాంగ్లలో నటించాను.. నితిన్ నటించిన మాస్ట్రో సినిమాతో విలనిజంతో బాగా ఆకట్టుకున్నాను తన సినీ కెరీర్ కి ఇది చాలు అంటూ తెలియజేసింది. దీంతో తమన్నా కెరియర్ ఇక అయిపోయినట్టే అంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.