తెలుగు సినీ ఇండస్ట్రీలో యమధర్మరాజుగా, వెండితెర పైన యముడుగా ఎన్నో విధాన పాత్రలలో నటించిన కైకాల సత్యనారాయణ నిన్నటి రోజున అనారోగ్య సమస్యతో మృతి చెందారు. ఈరోజు ఈయన అంత్యక్రియలు ప్రభుత్వ లాంచనాలలో జరగనున్నాయి. ఆరు దశాబ్దల కాలం పాటు కైకాల తన నట జీవితంలో ఎన్నో సినిమాలలో నటించడమే కాకుండా రాజకీయంగా కూడా ఎదిగారు. ముఖ్యంగా తెలుగు సినీ ప్రేక్షకులకు యముడు అంటే గుర్తుకు వచ్చేది ఈయనే చెప్పవచ్చు.
ఎంతోమంది సినీ ప్రముఖుల సైతం ఈయన పార్థివ దేహానికి నివాళులు అర్పిస్తూ ఉన్నారు. అలా ఇప్పటివరకు చిరు ,పవన్ కళ్యాణ్, వెంకటేష్, బ్రహ్మానందం తదితర నటీనటులు కైకాల కి నివాళులు అర్పించారు. తరచు వివాదాలలో నిలిచే నటుడు పోసాని కైకాల గురించి మాట్లాడుతూ పలు షాకింగ్స్ విషయాలను తెలియజేయడం జరిగింది. పోసాని ఇటీవలే ఆంధ్రప్రదేశ్‌లో ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా పదవిని అందుకున్నారు. పొలిటికల్ కార్యక్రమంలో ప్రత్యర్ధుల పైన విరుచుకుపడే పోసాని కైకాల మృతి విషయంలో కూడా పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
పోసాని చేసిన ఈ వాక్యాలు పొలిటికల్ గా ఏదో అటెన్షన్ పొందాలని చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. కైకాల ప్రశంసిస్తూనే రాజకీయ ఉద్దేశం ఉన్నట్లుగా కొన్ని కామెంట్లు చేశారు. చెంచాగిరి చేయకుండా, డ్రామాలు ఆడకుండా నిజాయితీగా బతికిన వారు కైకాల సత్యనారాయణ గారు కాలం ఉన్నంతకాలం కాకపోయినా సినీ కళాకారులు ఉన్నంతకాలం బతికి ఉండే నటుడు కైకాల గారు.. మీకు జోహార్ అని తెలియజేశారు పోసాని. అయితే పోసాని ఈ సమయంలో చెంచా గిరి, డ్రామాలు అంటూ పొలిటికల్ ప్రెస్మీట్లో వాడే పదాలు ఎందుకు వాడారు అంటూ కొంతమంది నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు. మరి కొంత మంది కైకాల గురించి పాజిటివ్‌గానే చెప్పారు కదా అంటూ కామెంట్ల చేస్తున్నారు.