టాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద అగ్ర హీరోల తరపున వచ్చిన చాలామంది పెద్దగా సక్సెస్ కాలేక సతమతమైన వారు ఉన్నారు. మరికొందరు వాళ్లకు పాపులారిటీ లేకపోయినా ఒడిదుడుకులు ఇబ్బందులు తట్టుకొని ఇండస్ట్రీలో సక్సెస్ సాధించిన వారు కూడా ఉన్నారు. అందులో ఒకరు మాస్ మహారాజు రవితేజ కూడా ఒకరు.ఈయన దాదాపు చిన్నచిన్న పాత్రలతో మొదలుపెట్టి పెద్ద పెద్ద సక్సెస్ సినిమాలను అందుకున్నాడు. పూరీ జగన్నాథ్ శ్రీను వైట్ల లాంటి డైరెక్టర్ డైరెక్షన్లో నటించి స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకున్నాడనే సంగతి తెలిసిందే.
చెప్పాలంటే రవితేజ ఈమధ్య తీసిన సినిమాలు అంతగా తనకి సక్సెస్ ని తెచ్చి పెట్టలేదనే చెప్పాలి. కొన్నేళ్ల క్రితం వరకు రవితేజ సినిమాలు అంటే ప్రేక్షకుల్లో మినిమం గ్యారెంటీ ఉండేది. కానీ రాజా ది గ్రేట్ సినిమా తరువాత వరుసగా ప్లాపులు ఆయనని చుట్టుముట్టాయి. అయితే క్రాక్ సినిమా తో హిట్ కొట్టి తన మార్కెట్ అలాగే ఉంటుందని ఆ సినిమాతో రవితేజ ప్రూఫ్ చేసుకున్నాడు.
అయితే క్రాక్ సినిమాలో కథ, కథనం కొత్తగా ఉండటంతో ఈ సినిమా మాస్ ప్రేక్షకులకు ఎంతగానో అలరించి సక్సెస్ను సాధించుకుంది. ఆ తరువాత మూడు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. అంతే రవితేజకు షాప్ వంతు వచ్చేసింది అనిపించింది. అయితే 2022లో చేసిన సినిమాలు చాలా మటుకు ఫ్లాప్ కావడంతో రవితేజ కి ఈ ఇయర్ బ్యాడ్ ఇయర్ గా మిగిలిపోయింది. రమేష్ వర్మ డైరెక్షన్లో తెరకెక్కిన ఖిలాడి మూవీతో లక్కును పరీక్షించుకున్నాడు. కానీ ఈ సినిమా కూడా డిజార్డర్ అనే సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
ఆ తర్వాత కూడా రామారావు ఆన్ డ్యూటీ ఆనే సినిమాతో తన లక్ ను పరీక్షించుకున్నాడు. అయితే లక్ కాస్త తారుమారు అయిందని చెప్పాలి. ఈ సినిమా కూడా అతనికి పెద్దగా సక్సెస్ ఇవ్వలేక పోయింది. రీసెంట్గా ధమాకా సినిమా తీశాడు. ఈ సినిమా కోసం రవితేజ ఎంతో కష్టపడ్డాడు.. రొటీన్ కథ కావటం వలన ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇది కూడా ప్లాప్ లిస్టులో చేరిపోయింది. కథ డిఫరెంట్ గా ఉంటే కచ్చితంగా సక్సెస్ అయ్యేవని మాస్ మహారాజ్ కథ విషయంలో అలాగే తన కెరీర్ విషయంలో తప్పడడుగులు వేయకుండా జాగ్రత్తగా ఉండాలి అంటున్నారు వారి అభిమానులు.