ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్ మీడియా ఎప్పటిలాగానే విడుదల చేసి ఆర్మక్ స్టార్స్ మోస్ట్ పాపులర్ మెయిల్ ఫిలిం స్టార్స్ ఫ్యాన్ ఇండియా లెవెల్ లిస్టులో ఒక లిస్టు విడుదల చేసింది. నవంబర్ నెలకుగాను ఈ లిస్టును విడుదల చేయడం జరిగింది. ఈ లిస్టులో టాప్ టెన్ లో మరొకసారి 5 మంది టాలీవుడ్ హీరోల స్థానాన్ని దక్కించుకోవడం గమనార్హం. అయితే మొదటి స్థానాన్ని ఎప్పటిలాగానే ఒక పాన్ ఇండియా సినిమా కూడా లేకుండానే తమిళ హీరో దళపతి విజయ్ దక్కించుకోవడం ప్రతి ఒక్కరికి ఆచార్యాన్ని కలిగిస్తోంది.
రెండవ స్థానాన్ని ఫస్ట్ తెలుగు పాన్ ఇండియా హీరో ప్రభాస్ నిలబెట్టుకోగా 3వ స్థానంలో బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్.. అలాగే RRR సినిమాతో పాన్ ఇండియా హీరోగా సత్తా చాటిన ఎన్టీఆర్ 4వ స్థానంలో ఉండగా అల్లు అర్జున్ మాత్రం 5వ స్థానంలో నిలబడ్డారు. కేజిఎఫ్ సిరీస్ తో మంచి పాపులారిటీ తెచ్చుకున్న యష్ 6వ స్థానాన్ని దక్కించుకోగా తమిళ స్టార్ హీరో అజిత్ 7వ స్థానంలో నిలవడం జరుగుతుంది.
ఒక్క పాన్ ఇండియా కూడా సినిమా లేకుండా విడుదల చేసిన మహేష్ బాబు 8దో స్థానం దక్కించుకోగా షారుక్ ఖాన్ మాత్రం 9వ స్థానంలో ఉన్నారు. ఇక రామ్ చరణ్ 10వ స్థానాన్ని దక్కించుకోవడం గమనార్హం. అయితే ఈ లిస్టులో విడుదల చేసిన ప్రతిసారి విజయ్ మొదటి స్థానం ఎందుకు వస్తుందనే విషయం చర్చ జరుగుతోంది. ముఖ్యంగా తమిళంలో అజిత్ అభిమానులు మాత్రం తీవ్రస్థాయిలో అగ్రహాన్ని తెలియజేస్తున్నారు. అజిత్ కి7వ స్థానం ఇవ్వడం విజయ్ కి మొదటి స్థానం ఇవ్వడంతో ఈ లిస్టు ఫేక్ అని కూడా తెలియజేస్తున్నారు అయితే తెలుగు అభిమానులు మాత్రం అసలు ఒక్క పాన్ ఇండియా సినిమా కూడా లేకుండా విజయ్ కి ప్రతిసారి పాన్ ఇండియా లిస్టులో ఫస్ట్ ప్లేస్ ఎలా వస్తుందని కామెంట్లు చేస్తున్నారు.
Ormax Stars India Loves: Most popular male film stars in India (Nov 2022) #OrmaxSIL pic.twitter.com/yXAR6SAXW9
— Ormax Media (@OrmaxMedia) December 22, 2022