సిపాయి కూతురు సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కైకాల సత్యనారాయణ ఎన్నో ఏళ్లపాటు ప్రేక్షకులను అలరించారు. ఎన్నో పారానిక, జానపద సినిమాలలో అలరించిన ఈయన ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో కూడా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. గతంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నా కైకాల సినిమాలకు దూరం కావడానికి గల కారణాన్ని కూడా తెలియజేశారు వాటి గురించి తెలుసుకుందాం.
గతంలో కైకాల సత్యనారాయణ మాట్లాడుతూ తన వంశంలో డిగ్రీ చదివిన వాళ్ళు ఎవరూ లేరని అందుకే తనకు డిగ్రీ పూర్తి చేయాలని ఆశ ఉండేదని మొదట గరికపాటి రామారావు దగ్గర సినిమాలలో అవకాశం ఇస్తానంటే చదువుకోవాలని ఉద్దేశంతో నటించనని చెప్పానని తెలిపారు. కానీ డిగ్రీ పూర్తి అయ్యేసరికి నటన వైపు రావాలని నిర్ణయించుకున్నాను.. అలా కొత్త వారితో ఎల్వీ ప్రసాద్ గారు కొడుకులు కోడళ్ళు సినిమాని తీస్తున్నారని మద్రాస్ కు రావాలని తనకు లేఖ వచ్చిందని తన తండ్రికి చెప్పగా నీ ఇష్టం అని చెప్పారట.
అలా వేసిన అడుగు ఆశతో మద్రాసుకి వెళ్లి ఎస్సీ ప్రసాద్ గారిని కలిశాను పాత్రకు తగ్గట్టుగా తనకు మేకప్ వేసి సినిమాల్లోకి బాగా పనికొస్తామని చెప్పారట. సినిమా మొదలుకావడానికి ఇంకా కొంత సమయం పడుతుందని చెప్పడంతో 15 రోజులపాటు పార్కులోనే పడుకొని నివసించాలని తెలిపారు. మొదటిసారి సిపాయి కూతురు సినిమాలో నటించగా పెద్దగా ఆకట్టుకోలేక పోయిందని తెలిపారు. ఆ సమయంలో విఠలాచారి గారు తనని చేరదీశారని నా పాలిట దైవమని తెలిపారు కైకాల.
మొదట హీరోగా ఎంట్రీ ఇచ్చిన విలన్ గా ప్రేక్షకులను అల్లరించాను విలన్ గా నటిస్తే బాగుంటుందని తనకు తొలిసారి ప్రతి నాయకుడు వేషం ఇచ్చింది విఠలాచారి గారి అని తెలిపారు. ఇక సినిమాలు మానేయడానికి గల కారణం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల వల్ల సినిమాకు దూరంగా ఉండడం తప్పడం లేదని తెలిపారు. ముఖ్యంగా నాటికి నేటికి స్క్రిప్ట్ విషయంలో ,పాత్రల విషయంలో, నటీనటుల ప్రవర్తన విషయంలో ,ఆ గౌరవ మర్యాదలు చూస్తే అంత అసంతృప్తిగా కనిపిస్తోందని.. అలాగే రెమ్యూనరేషన్ విషయంలో కూడా ఇలాగే జరుగుతోందని..గతంలో హీరోలు ఒక సినిమా చేస్తే మేము నాలుగైదు సినిమాలు చేసే వాళ్ళం దానివల్ల హీరోలతో సమానంగా పారితోషకం ఉండేదని తెలిపారు. అప్పట్లో అందరూ కల కోసం చూసుకుంటే..నేడు కాసుల కోసం చూసుకుంటున్నారని తెలిపారు. అందుచేతనే సినిమాలకు దూరమయ్యారని తెలిపారు సత్యనారాయణ.