రష్యా సినిమాలో పుష్ప చిత్రానికి అన్ని కోట్లు నష్టమా..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ఎంతో ప్రతిష్టాత్మకంగా చిత్రం పుష్ప. ఈ చిత్రాన్ని డైరెక్టర్ సుకుమార్ ఎంత అద్భుతంగా తెరకెక్కించారు .ఇందులో హీరోయిన్గా రష్మిక నటించింది. కీలకమైన పాత్రలో సునీల్ ,అనసూయ ,రాహు రమేష్, ఫహద్ ఫాజిల్ నటించారు. ప్రస్తుతం పుష్ప చిత్రం తెలుగు సినిమా ఇండస్ట్రీ హద్దులను పూర్తిగా చెరిపేసిందని చెప్పవచ్చు. ఈ మధ్యకాలంలో తెలుగు ఇండస్ట్రీ నుంచి విడుదలైన ఎన్నో చిత్రాలు కూడా ఇతర భాషలలో కూడా బాగా సత్తా చాటుతున్నాయి.

Allu Arjun's 'Pushpa' special shows canceled in Chennai | Tamil Movie News  - Times of India

తెలుగులో బాహుబలి, RRR సినిమాలు ఇతర దేశాలలో కూడా విడుదలే కలెక్షన్ల సునామిని సృష్టించాయి. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాకు కూడా మరింత క్రేజ్ ఏర్పడింది. గత ఏడాది డిసెంబర్ 17వ తేదీన విడుదలైన ఈ చిత్రం కేవలం తెలుగులోనే కాకుండా ఇతర భాషలలో కూడా విడుదల చేసి మంచి కలెక్షన్లను రాబట్టాయి. దీంతో ఇండియాలో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నటువంటి ఈ సినిమా రష్యాలో కూడా విడుదల చేయాలని చిత్ర బృందం భావించారు.

ఈ క్రమంలోనే ఈ ఏడాది డిసెంబర్ 8వ తేదీన ఈ సినిమాని రష్యా భాషలో విడుదల చేశారు .ఇక ఈ సినిమా ప్రమోషన్స్ కోసం చిత్ర బృందం రహస్యాలు పర్యటించింది. అందుకోసం భారీగానే ఖర్చు చేసినట్లుగా కూడా తెలుస్తోంది.అయితే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు అనంతరం ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం కేవలం మూడు రోజుల్లోనే థియేటర్ నుంచి తొలగించడం జరిగిందట. విడుదలైన అన్ని భాషలలో మంచి విజయ దిశగా ఉన్న పుష్ప చిత్రం రష్యాలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.దీంతో ఈ సినిమాకు రూ .4 కోట్లకు పైగా నష్టం వచ్చినట్లు సమాచారం.

Share.