2022లో ట్రోల్ చేయబడిన టాలీవుడ్ చిత్రాలు ఇవే..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

2022 ఏడాది సినీ ఇండస్ట్రీలో వరుసగా విషాదాలు , బ్లాక్ బస్టర్ చిత్రాలు ,ఘోరమైన డిజాస్టర్ చిత్రాలు, ట్రోల్లింగ్ చిత్రాలు చాలనే విడుదలయ్యాయి. ఈ ఏడాది బోర్లపక్క పడ్డ కొన్ని చిత్రాలు వల్ల కొన్ని వందల కోట్ల రూపాయల నష్టాన్ని చవి చూడవలసి వచ్చింది నిర్మాతలు ఆ సినిమాలు గురించి ఒకసారి తెలుసుకుందాం.

ఈయేడాది విడుదలైన సినిమాల్లో అత్యధికంగా ట్రోల్స్ కి గురైన సినిమాలో మొదటి స్థానం సన్నాఫ్ ఇండియా సినిమాకి ఉంది. ఈ చిత్రంలో మోహన్ బాబు హీరోగా నటించారు. VFX మొదలుకొని ప్రతి ఒక్క సన్నివేశానికి కూడా సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం జరిగింది. ఇక తర్వాత మంచు విష్ణు నటించిన జిన్నా సినిమా కూడా దారుణంగా నిరాశపరిచింది. ఇందులో సన్నిలియోన్, పాయల్ రాజ్ పుత్ నటించిన నిరాశనం మిగిల్చింది. దీంతో ఈ సినిమా పై పెద్ద ఎత్తున విమర్శలు వినిపించాయి.

ఇక ప్రభాస్ నటించిన రాధే శ్యామ్ సినిమా కూడా దారుణంగా ట్రొల్ కు గురైంది. టైటానిక్ రేంజ్ లో క్లైమాక్స్ ప్లాన్ చేసామన్నారు.. ఇదేంటి అంటూ సోషల్ మీడియాలో డైరెక్టర్ని దారుణంగా విమర్శించారు.

ఈ ఏడాది భారీ స్థాయిలో విడుదలైన సినిమా ఆచార్య. ఈ సినిమా కూడా దారుణమైన ట్రోలింగ్ కి గురి చేశారు.

ఇక రవితేజ నటించిన రామారావు ఆన్ డ్యూటీ సినిమా కూడా ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు వెళ్ళిందో అన్నట్టుగా ఉన్నది.

విజయ్ దేవరకొండ మొదటిసారి పాన్ ఇండియా హీరోగా నటించిన లైగర్ సినిమాని డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కించారు ఈ సినిమా డిజాస్టర్ కావడమే కాకుండా దారుణమైన ట్రోల్స్ ని ఎదుర్కొంది.

ఇలా ఏడాది అన్ని రూల్స్ ఈ సినిమాలు ఎదుర్కొన్నాయి.

Share.