సినీ సెలబ్రిటీల జతకాలు, రాజకీయ ప్రముఖుల జాతకాలు చెబుతూ ఎప్పుడు వైరల్ గా మారుతూ ఉంటారు ఆస్ట్రాలజీ వేణు స్వామి. గడచిన కొద్ది రోజుల క్రితం నుంచి సమంత ,నాగ చైతన్య విడాకుల వ్యవహారం తర్వాత మరింత వైరల్ గా మారారు. ఇప్పుడు తాజాగా రష్మిక మందనకు సంబంధించి ఒక విషయం చెప్పి మళ్ళీ ట్రెండీగా నిలుస్తున్నాడు వేణు స్వామి. వీటి గురించి పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం.
గతంలో రష్మిక కెరియర్ సజావుగా సాగాలని వేణు స్వామి దగ్గర పూజ చేయించుకున్నట్లు కొన్ని ఫోటోలు కూడా వైరల్ గా మారాయి. ఇక రక్షిత్ శెట్టితో బ్రేకప్ చేస్తే జీవితం బాగుంటుందని చెప్పడంతో వేణు స్వామి మాటలు నమ్మి వదిలేయడం జరిగింది. ఇప్పుడు తాజాగా విజయ్ జాతకం ప్రకారం రష్మిక కెరియర్ మీద పడుతోంది అని తెలియజేస్తున్నారు వేణు స్వామి. అందుచేతనే రష్మిక కు అంత బ్యాడ్ టైం నడుస్తోందని తెలుపుతున్నారు. విజయ్ ,రష్మికలు కలిసి ఉంటే ఇలాంటి అవమానాలు దురదృష్టాలు చోటు చేసుకుంటాయని వారి జాతకాల రీత్యా అలా ఉన్నాయని వేణు స్వామి తెలియజేశారు.
ముఖ్యంగా రష్మిక మీద వచ్చిన కాంట్రవర్సీలు కూడా జాతక ప్రభావమే అని తెలుపుతున్నారు. ఈ మధ్య రష్మిక మీద కన్నడ ఇండస్ట్రీ బ్యాన్ వేసిందని వార్తలు కూడా వినిపించాయి. రిశబ్ శెట్టి కాంతార వివాదంలో రష్మిక ఇరుక్కోవడం అందరికీ తెలిసిందే .ఇలా పర్సనల్గా కెరియర్ పరంగా పెద్దగా రష్మికకు కలిసి రాలేదని చెప్పవచ్చు. హిందీలో చేసిన సినిమాలు కూడా పెద్దగా ఆకట్టుకోలేక పోతున్నాయి. ప్రస్తుతం రష్మిక చేతిలో తెలుగులో పుష్ప -2 సినిమా మాత్రమే ఉన్నది. ఇదంతా కేవలం విజయ్ దేవరకొండ వల్లే ఈమెకు జరుగుతోందని వేణు స్వామి తెలియజేస్తున్నారు.