టాలీవుడ్లో తీవ్ర విషాదం సీనియర్ నటుడు కన్నుమూత..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలీవుడ్ దిగ్గజ నటులలో ఒకరైన సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ గడిచిన కొన్ని గంటల క్రితం పలు అనారోగ్య సమస్యతో మరణించినట్లు తెలుస్తోంది. గడిచిన కొద్ది రోజుల క్రితం నుంచి సత్యనారాయణ అనారోగ్య సమస్యతో బాధపడుతూ ఉన్నారట.నిన్నటి రోజున రాత్రి ఆయనకు ఇంటి దగ్గర చికిత్స అందించినట్లు వైద్యులు తెలుస్తోంది. కైకాల సత్యనారాయణ దాదాపుగా 700 పైగా చిత్రాలలో నటించారు.

ఎన్నో చిత్రాలలో విలన్ గా నటించి విలక్షణమైన నటనతో పేరు పొందారు కైకాల. ఈ నటుడు మరణ వార్త విని సినీ ప్రముఖులు, ఆయన అభిమానులు సైతం తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. ప్రస్తుతం కైకాల సత్యనారాయణ వయస్సు 87 సంవత్సరాలు. సత్యనారాయణ 60 ఏళ్ల సినీ జీవితాన్ని అనుభవించారని సినీ ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తూ ఉంటాయి .సీనియర్ ఎన్టీఆర్ డూప్ గా కూడా ఎన్నో చిత్రాలలో నటించారు ఈయన కామెడీ, విలన్ గాను మెప్పించారు. ఎన్నో చిత్రాలలో సత్యనారాయణ విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్టుగా రకరకాల పాత్రలలో నటించి మెప్పించారు.

గడిచిన కొంతకాలంగా వయోభారంతో ఈయన సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఒకప్పుడు రమా ఫిలింస్ అనే బ్యానర్ తో ఎన్నో చిత్రాలను నిర్మించారు కైకాల సత్యనారాయణ. కైకాల సత్యనారాయణ తర్వాత ఆయన వారసుడు శాండిల్ వుడ్ నిర్మాణంలో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ఇంతటి గొప్ప నటుడిని తెలుగు ప్రేక్షకులు కోల్పోవడం ఇదొక విషాదమని చెప్పవచ్చు. కైకాల పార్తివదేహాన్ని చూడడానికి ఎంతో మంది అభిమానులు సిని ప్రముకులు సైతం హాజరవుతున్నారు.

Share.