ఈటీవీలో ప్రచారం అవుతున్న జబర్దస్త్ షో ద్వారా ఎంతమంది కమెడియన్లు పుట్టుకొచ్చారు. అంతేకాకుండా చాలామంది ఈ షో ద్వారానే స్థిరపడ్డారని కూడా చెప్పవచ్చు. మొదట్లో జబర్దస్త్ షోలో ఉన్న కమెడియన్స్ ఇప్పుడు లేరు. రాను రాను అందరూ జబర్దస్త్ షోకి దూరం అయిపోతున్నారు. దీంతో మల్లెమాలవారు కొత్తగా కమెడియన్లను తీసుకొస్తున్నారు. ఇటీవలే హైపర్ ఆది కూడా షో నుండి బయటికి వెళ్ళిపోతున్నారని టాక్ వినిపిస్తోంది.గతంలో కూడా ఆది షో నుండి బయటకు వెళ్లిపోయాడు కానీ మళ్ళీ తిరిగి వచ్చాడు. కానీ ఈసారి అలా కాదు కచ్చితంగా వెళ్ళిపోతున్నట్లు సమాచారం.
అయితే ఆది తనకు తానే వెళ్లిపోతున్నాడా లేదా మల్లెమాలవారు పంపిస్తున్నారో తెలియటం లేదు. మొత్తానికి హైపర్ ఆది జబర్దస్త్ షో కి గుడ్ బై చెప్పినట్లే అనే మాట బుల్లితెర సన్నిహిత వర్గాల నుంచి సమాచారం అందుతోంది. ఈ షో నుంచి ఆది మాత్రమే కాదు. ఇక వేరే టీం కూడా గుడ్ బై చెప్పబోతుందని సమాచారం.ముఖ్యంగా ఈ షో ని ఒక రేంజ్ కు తెచ్చిన సుడిగాలి సుదీర్ టీం కు చెందిన రాంప్రసాద్ ,గెటప్ శీను వీరిద్దరూ కూడా ఈ షో నుండి వెళ్లిపోవాలనుకుంటున్నట్లు సమాచారం.
ఆల్రెడీ సుడిగాలి సుదీర్ వెళ్ళిపోయాడు ఆయన వెళ్లిపోయిన తర్వాత వారి టీంలో చాలా మార్పులు జరిగాయి. ఆ మార్పుల వలన ఆ టీమ్ మెంబర్స్ సంతృప్తిగా లేరని సమాచారం.అందుకని వారు కూడా మల్లెమాలలో ప్రసారమవుతున్న కార్యక్రమాలన్నింటికీ గెటప్ శీను ,రాంప్రసాద్ గుడ్ బై చెప్పే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సమాచారం. బుల్లితెరపై ఒక కామెడీ షో రాబోతోందని (స్టార్ మా లేదా జీ తెలుగు) మొదలు కాబోతోందట. ఆ కామెడీ షో కోసం వీరంతా రెడీ అవుతున్నట్లు సమాచారం. మరి ఇది ఎంతవరకు నిజమో చూడాలి