నందమూరి బాలకృష్ణ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మనసులో ఏది దాచుకోకుండా నిక్కచ్చితంగా నిర్మొహమాటంగా బయటకు చెప్పగలిగిన ఏకైక గొప్ప నటుడు. ముఖ్యంగా తన మనసులో ఏది అనుకుంటే ఆ మాటలను కచ్చితంగా బయటకు చెప్పేస్తూ ఉంటాడు . అయితే ఆ మాటల వల్ల కొన్ని కొన్ని సార్లు విమర్శలు కూడా ఎదుర్కొంటూ ఉంటారు బాలయ్య. అయితే ఏ రోజు కూడా వాటిని పట్టించుకోరు. ఇదిలా ఉండగా తాజాగా బాలకృష్ణ నేను , శృతిహాసన్ ఏపీకే హాట్ పెయిర్ అంటూ సంచలన కామెంట్లు చేయగా.. ప్రస్తుతం అవి కాస్త ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.
తాజాగా అన్ స్టాపబుల్ షోలో భాగంగా బాలయ్య ఈ కామెంట్లు చేయడం గమనార్హం . ప్రోమోలో భాగంగా జై బాలయ్య పాటకు జయప్రద, జయసుధ , బాలకృష్ణ డాన్స్ చేశారు.. అంతేకాదు నేను పడిపోయా పడిపోయా అని చెబుతూ బాలయ్య రాశీఖన్నాను తెగ నవ్వించారు. ఆ తర్వాత రాశి ఖన్నా తన స్వీట్ వాయిస్ తో ఊహలు గుసగుసలాడే సినిమాలోని ఏం సందేహం లేదు పాటను అద్భుతంగా పాడి అందరినీ అలరించింది. ఆ తర్వాత బాలయ్య 4 టకీలా షార్ట్ లు వేసేద్దామని అడగగా రాశీఖన్నా కూడా ఓకే చెప్పింది.
ఆ తర్వాత నేను , శృతిహాసన్ ప్రస్తుతం హాట్ పెయిర్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ అని వెల్లడించారు. హీరోయిన్ అవ్వాలంటే కొన్ని విషయాలలో రాజీ పడక తప్పదని.. ఇది నిజమా? అబద్దమా? అని కూడా బాలయ్య ఈ ముగ్గురు హీరోయిన్లను ప్రశ్నించడం జరిగింది. అంతేకాదు ఉమెన్ సెంట్రిక్ సినిమాలను నిర్మించడానికి నిర్మాతలు 100 సార్లు ఆలోచిస్తారు నిజమా? అబద్దమా? అని కూడా బాలయ్య అడిగారు. అయితే ఈ ప్రశ్నలకు హీరోయిన్ లు చెప్పిన సమాధానాలు తెలియాలి అంటే శుక్రవారం ఎపిసోడ్ స్ట్రీమింగ్ అయ్యేవరకు ఎదురు చూడాల్సిందే.