బుల్లితెరపై ప్రసారమయ్యేటువంటి జబర్దస్త్ షో ద్వారా ఎంతో మంది కమెడియన్లు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇందులో యాంకర్లుగా పేరు పొందిన రష్మీ, అనసూయ కూడా సినీ ఇండస్ట్రీలో బాగానే ఆకట్టుకుంటున్నారు. అయితే ఈ మధ్య అనసూయ జబర్దస్త్ అభిమానులు సైతం చాలా హర్ట్ అయ్యారు. ఇక స్టార్ మా లో కొన్ని రోజులుగా కామెడీ స్టార్స్ మరియు ఇతర కార్యక్రమాలలో కనిపించిన అనసూయ ఈ మధ్యకాలంలో బుల్లితెరపై అసలు కనిపించడం లేదు. కానీ చిత్రాలలో మాత్రం బాగానే నటిస్తోంది.
ప్రస్తుతం అనసూయ ఏం చేస్తోంది అంటు అభిమానులు సోషల్ మీడియాలో పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం అనసూయ పుష్ప -2 సినిమాలలో తప్ప అనసూయ మరే సినిమాలో నటిస్తుందో లేదో కూడా క్లారిటీగా లేదంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. అయితే గతంలో మాత్రం అనసూయకు వరుస ఆఫర్లు వస్తున్నాయని ఆ కారణంగానే జబర్దస్త్ కార్యక్రమాన్ని వదిలేసింది అన్నట్లుగా వార్తలు వినిపించాయి. కానీ అసలు విషయం ఏమిటంటే సినిమాలలో ఆమెకు ఆఫర్లు రావడం లేదని అయినా కూడా జబర్దస్త్ కార్యక్రమాన్ని వదిలేయవలసి వచ్చింది అంటూ పలువురు అనసూయ సన్నిహిత వర్గాల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి.
అనసూయ నటించిన చిత్రాలు అన్నీ కూడా పెద్దగా సక్సెస్ కాలేకపోవడంతో ఈమె కెరియర్ ప్రస్తుతం డల్ అయిందని చెప్పవచ్చు. అయితే అనసూయ జబర్దస్త్ కార్యక్రమానికి గుడ్ బై చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అంటూ అభిమానులు ప్రశ్నిస్తూ ఉన్నారు అనసూయ మళ్లీ తిరిగి జబర్దస్త్ లోకి రావాలని చాలామంది కోరుకుంటున్నారు. మరి అనసూయ జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇస్తుందేమో చూడాలి మరి.