తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎలాంటి హీరో అయినా ఒక్క సినిమాతో ఊహించని స్థాయిలో హీరోగా ఎదిగిపోతారని చెప్పవచ్చు. అలా ఇప్పటివరకు ఎంతోమంది స్టార్ హీరోలుగా ఎదిగిపోయారు. అలాంటి వారిలో హీరో నిఖిల్ కూడ ఒకరు. మొదట్లో నటించిన చిత్రాలు ఆకట్టుకోలేకపోయాయి. యువత, కార్తికేయ, స్వామి రారా వంటి సినిమాలు ఆయనకి మంచి క్రేజ్ ను తెచ్చిపెట్టాయి.. నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ కలిసి నటించిన కార్తికేయ-2 సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో అలాగే అది పాన్ ఇండియా స్థాయిలో విడుదలై ఆకట్టుకుంది.
ఇప్పుడు తాజాగా18 పేజీస్ రాబోతోంది.ఈ సినిమాకి పల్నాటి సూర్య దర్శకత్వం వహిస్తున్నాడు. అల్లు అరవింద్ సమర్పణలో సుకుమార్ రైటింగ్స్ నుంచి గీత ఆర్ట్స్ బ్యానర్ లో రాబోతోంది. అందుకని ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.ఈ సినిమా ట్రైలర్, టీజర్, పోస్టర్స్ చూస్తుంటే సినిమాపై భారి అంచనాలు వెలువడుతున్నాయి. ఈ సినిమా ఎన్నో అంచనాలతో డిసెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సినిమాకి పెద్ద ఎత్తున చిత్ర బృందం ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ సినిమాకు సంబంధించిన ఒక తాజా సమాచారం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది ఈ సినిమా డిజిటల్ హక్కుల ద్వారానే భారీగా లాభాలు పొందినట్లు సమాచారం.ఈ సినిమా ఓటీటి డిజిటల్ రైట్స్ భారీరేట్లకు అమ్ముడుపోయాయని సమాచారం. డిజిటల్ రైట్స్ ను నెట్ పిక్స్ ఏకంగా రూ .20 కోట్లకు కొనుగోలు చేశారనే సమాచారం.ఈ సినిమా శాటిలైట్ హక్కులను ప్రముఖ ఎంటర్టైన్మెంట్ సంస్థ కైవసం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇలా ఓటిటి, సాటిలైట్ ద్వారా ఈ సినిమా భారీగా లాభాలు పొందుతున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరి కాంబినేషన్లో కార్తికేయ 2 సినిమా ఎంత సక్సెస్ను సాధించిందో 18 పేజీస్ సినిమా కూడా అంత పెద్ద సక్సెస్ను సాధిస్తుందో చూడాలి మరి.