తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్నో ఫ్యామిలీ కథ చిత్రాలలో,లవ్ చిత్రాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు వెంకటేష్. విక్టరీ వెంకటేష్ అంటూ పలు విజయాలను తన ఖాతాలో వేసుకున్నారు. వెంకటేష్ సినిమాలలో వినోదంతో పాటు వైవిద్యమైన ఉండే పాత్రలో నటిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే వెంకి హెయిర్ విషయంలో పలుమార్పులు గమనించవచ్చు. హీరోలలో చిన్న చిన్న మార్పులు అయితే చేస్తారు..కానీ పెద్ద మార్పులు మాత్రం విగ్గుతోనే అవుతాయి అనే విషయం అందరికీ తెలిసిందే. అయితే అలా వెంకటేష్ కూడా విగ్గులు వాడుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.
వెంకటేష్ ఎన్నో చిత్రాలలో విభిన్నమైన హెయిర్ స్టైల్ తో కనిపించడం జరిగింది. అందుకోసం వెంకటేష్ ఎన్నో చిత్రాలను విగ్గు కూడా ఉపయోగించినట్లు సమాచారం. ఒక్కో సినిమాకి ఒక్కొక్క లా విగ్గు ఉపయోగించుకుంటూ ఉంటారట. అంటే సినిమాలోని పాత్రను బట్టి విగ్గు ఎంపిక ఉంటుందని ఇందుకోసం విదేశాల నుంచి విగ్గులు తెప్పిస్తారట. వెంకీ విగ్గుల గురించి అతని మేకప్ మ్యాన్ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. ప్రస్తుతం మాత్రం అవి సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
వెంకటేష్ నటించిన తాజా చిత్రాలను చూస్తే ఈ విషయం మనకి అర్థమవుతుంది. ప్రస్తుతం స్ట్రిమ్మింగ్ కి సిద్ధంగా ఉన్న రామానాయుడు లో వెంకీ వైట్ హెయిర్ తో కనిపించబోతున్నారు. చూడడానికి కాస్త డిఫరెంట్ గా ఉన్న వైట్ హెయిర్ విగ్గును అమెరికా నుంచి తెప్పించారట. అందుకోసం రూ.75 వేల రూపాయలు ఖర్చు చేసినట్లు సమాచారం. న్యాచురల్ గా కనిపించాలి అంటే అంత ఖర్చు చేయాల్సిందే అంటూ తెలిపారు.ఇక నారప్ప సినిమా కోసం వెంకీ ఒక విగ్గు తెప్పించారు. ఈ చిత్రంలో వెంకటేష్ ఒక పాత్ర కోసం గ్రే కలర్లో కనిపిస్తారు ఆ విగ్రహం విదేశాల నుంచి తెప్పించారు అది రూ 65 వేలు అని తెలిపారు. ఇలా వెంకటేష్ అన్ని నేచురల్ గా ఉండే విగ్గులని వాడుతారని తెలిపారు.