టాలీవుడ్ లో ఛలో సినిమాతో ఒక రేంజ్ పాపులారిటీని సంపాదించుకున్న రష్మిక అందరికీ సుపరిచితమే.. పుష్ప సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకొని నేషనల్ క్రష్ హీరోయిన్గా మారింది. కానీ ఈమె మొట్టమొదటిగా కన్నడ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. ఆ తరువాత తెలుగు ఇండస్ట్రీలోకి వచ్చి టాప్ హీరోయిన్ పొజిషన్ కి చేరుకుంది. అయితే ఇటీవల హిందీ సినిమా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు ఆఫర్ ఇచ్చిన రిసబ్ శెట్టి, రక్షిత్ శెట్టి గురించి మాట్లాడకుండా సైలెంట్ గా ఉండడంతో నేటిజెన్లు ఆమెపై దుమ్మెత్తి పోస్తున్నారు. అంతేకాకుండా రిషబ్ శెట్టి కూడా ఈ విషయంపై ఘాటుగా స్పందించారని వార్తలు వినిపిస్తున్నాయి.
ఇదంతా జరిగిన తరువాత రిషబ్ శెట్టికి సారి చెప్పటానికి అలాగే తనను ఈ వివాదం నుంచి బయటపడేయడానికి రక్షితశెట్టిని ఉపయోగించుకోవడానికి తెగ ట్రై చేస్తోందన్న వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. రష్మిక, రక్షిత్ శెట్టి విడిపోవడానికి ఏదైనా బలమైన కారణం ఉందా అని అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.. కానీ రష్మిక తప్పు చేయకపోతే ఎందుకు సారీ చెప్పాలనుకుంటుంది. అంటూ కొందరు కామెంట్స్ తెలియజేస్తున్నారు.
అయితే తనకు ఆఫర్ ఇచ్చిన రిషబ్ శెట్టి లేక రక్షిత్ శెట్టి వీరిద్దరి గురించి చెప్పకపోవటమే ఆమె చేసిన పెద్ద తప్పు ఇక కిరాక్ పార్టీ ద్వారా తనకు కెరీర్ ప్రారంభించిన నిర్మాత, దర్శకుడు రిసబ్ శెట్టి గురించిచెప్పకపోవడం… అలాగే తన మాజీ ప్రేమికుడు రక్షిత్ శెట్టి గురించి విస్మరించటం పై నేటిజెన్లు పెద్ద ఎత్తున ఫైర్ అయ్యారు. కాంతారా మూవీ దేశవ్యాప్తంగా పాపులారిటీని సంపాదించుకున్న రిసబ్ శెట్టి రూత్ ప్రభులో సమంత, రష్మిక వీరిద్దరిలో ఎవరు బెస్ట్ అని అడగ్గా ఆయన ఇచ్చిన సమాధానం వింటే రష్మిక మీద కోపంగా ఉన్నారని చెప్పాలి. తనకి సమంత పర్ఫామెన్స్ అంటే ఇష్టమని చెప్పారు. ప్రస్తుతం రష్మిక కి సంబంధించి ఈ విషయం వైరల్ గా మారుతోంది.