తెలంగాణ ప్రభుత్వం రైతులకు అందిస్తున్న సంక్షేమం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇందులో ఎన్నో పథకాలను రైతులకు అందుబాటులోకి తీసుకువస్తోంది. ఇలాంటి పథకాలలో రైతు బంధు పథకం కూడా ఒకటి. ఈ పథకం ద్వారా ప్రతి ఏడాది రైతుల అకౌంట్లో ప్రభుత్వం కొంత సొమ్మును జమ చేస్తూ ఉంటుంది. ఇలా రైతుబంధు పథకం ద్వారా ఎంతో మంది రైతులు లబ్ధి పొందుతున్నారని తెలంగాణ ప్రభుత్వం చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. కానీ తెలంగాణ ప్రభుత్వం అమలులోకి వచ్చిన తరువాత రైతు బంధు పథకం పట్ల కొంతమంది విమర్శలు చేస్తూ ఉన్నారు.
ఈ క్రమంలోనే మాజీ ఐపీఎస్ అధికారి అనుకూరి మురళి ఈ పథకం గురించి పలు సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మురళి మాట్లాడుతూ రైతుల కోసం తీసుకు వచ్చినటువంటి ఈ రైతు బంధు పథకం కేవలం రైతులకు మాత్రమే కాకుండా ధనవంతులకు కూడా ఈ పథకంతో లబ్ధి పొందుతున్నారని తెలియజేశారు. ఈ క్రమంలోనే హీరో అక్కినేని నాగార్జున కూడా ఈ రైతు బంధు డబ్బులు జమ చేసుకుంటున్నారని ఆరోపించారు.
ఈయన సినిమా హీరోగా మాత్రమే కాకుండా హైదరాబాదులో పలు బిజినెస్ లతో పాటు,100 ఎకరాల భూమి కలిగి ఉన్న నటుడుగా పేరుపొందారు. అంతేకాకుండా అన్నపూర్ణ స్టూడియో కూడా ఉన్నది. ఇలా వందల ఎకరాలు ఉన్నటువంటి నాగార్జున రైతుబంధు పథకానికి అర్హుడా అంటూ ఈయన పథకం పైన విమర్శలు కురిపించారు. ఇక గడిచిన కొన్ని సంవత్సరాల నుంచి అమెరికాలో స్థిరపడిన కొంతమంది తెలంగాణ వాసులు కొన్ని వందల ఎకరాల భూములు ఉన్నాయని ఈ పథకానికి లబ్ధిదారులుగా మారారని తెలియజేశారు.
వ్యవసాయం అంటే ఇష్టపడని ఎమ్మెల్యేలు, మంత్రులు సంపన్నులకు సైతం ఈ పథకానికి లబ్ధిదారులుగా మారడంతో తెలంగాణ ప్రభుత్వ తీరు పైన మురళి తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. ప్రస్తుతం నాగార్జున పైన చేసిన ఈ కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి. మరి వీటి పైన నాగార్జున ఎలా స్పందిస్తారో చూడాలి.