హీరోయిన్గా మహేష్ బాబు భార్యగా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించింది హీరోయిన్ నమ్రత. ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.నటిగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న సమయంలో మహేష్ బాబుతో కలిసి వంశీ సినిమాలో నటించి ప్రేమలో పడి ఆ తర్వాత వివాహం చేసుకుంది. ఆ తర్వాతే ఇమే పూర్తిగా ఇండస్ట్రీకి దూరమై కేవలం పిల్లలు బాధ్యతలను కుటుంబ బాధ్యతలను చూసుకుంటోంది. ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నా నమ్రత పలు ఆసక్తికరమైన విషయాలు తెలియజేసింది. వాటి గురించి చూద్దాం.
నమ్రత మాట్లాడుతూ వివాహానికి ముందు మహేష్ బాబు చాలా క్లారిటీతో ఉన్నప్పటికీ.. వివాహం తర్వాత సినిమాలలో నటించకూడదని చెప్పారట.. ఇక నమ్రత కూడా తనకు సినిమాల కన్నా మహేష్ బాబుతో వివాహం జరగడం చాలా బెస్ట్ మూమెంట్ అని పెంచిందని తెలియజేసింది. మహేష్ తో వివాహమైన తర్వాత పూర్తిగా తన ప్రపంచం మారిపోయిందని పెళ్లి తర్వాత ఒక భార్యగా, తల్లిగా తన బాధ్యతలు నిర్వహించడం కోసమే తాను సినిమాలకు దూరమయ్యానని తెలియజేసింది నమ్రత.
ఇక తన పిల్లల గురించి మాట్లాడుతూ.. గౌతమ్ పుట్టినప్పుడు తన ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నానని ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఇలాంటి కష్టాలు వస్తూనే ఉంటాయి. గౌతమ్ పుట్టిన తర్వాత బతకడం కష్టమని డాక్టర్లు చెప్పారని అప్పటి సంఘటనలు గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయింది నమ్రత .ఇక సితార గురించి మాట్లాడుతూ సితార తమ జీవితంలోకి అనుకోకుండా వచ్చిందని.. సితార లేకపోతే మా జీవితం ప్రస్తుతం అసంపూర్ణంగా ఉండేదని నమ్రత ఈ సందర్భంగా తెలియజేసింది. నమ్రత చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇక మహేష్ బాబు గురించి మాట్లాడుతూ తను నటించిన సినిమాలలో పోకిరి సినిమా అంటే చాలా ఇష్టమని తెలియజేసింది.