మెగా కుటుంబం నుంచి నాగబాబు, పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో చాలా చురుకుగానే వ్యవహరిస్తున్నారు. ఇక కొన్నిసార్లు నాగబాబు మాట్లాడే మాటల వల్ల మెగా కుటుంబం కొన్నిసార్లు ఇబ్బందులు పడవలసి వస్తుంది. ఇలా ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా నాగబాబు మాట్లాడిన కొన్ని మాటల వల్ల ట్రోలింగ్ కి మరొకసారి గురవుతున్నారు. వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
ఈమధ్య గాడ్సే గురించి ప్రస్తావిస్తూ నాగబాబు చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపుతూ ఉన్నాయి. ఈసారి పవన్ ను పొగిడేందుకు మైకు తీసుకున్న నాగబాబు ఆ మాటలతో మరొకసారి ఇరుకున పెట్టించేశారు. నాగబాబు ఏమన్నారంటే.. పవన్ కళ్యాణ్ ఏ సినిమా పడితే ఆ సినిమా అసలు చేయరు. క్వాలిటీ ఉన్న సినిమాలే చేస్తారంటూ తెలియజేశారు.సరిగ్గా ఇక్కడే కొంతమంది నెటిజన్లు సైతం.. నాగబాబుపై విరుచుకుపడుతూ పవన్ ఏ సినిమా పడితే ఆ సినిమా చేయరని.. కేవలం రీమిక్స్ మాత్రమే చేస్తారని కొంతమంది సెటైర్లు వేస్తూ ఉన్నారు. క్వాలిటీ ఉన్న సినిమాలు అంటే గతంలో పంజా, పులి, కెమెరామెన్ గంగతో రాంబాబు వంటి చిత్రాలు అంటూ మరి కొంతమంది కామెడీ ఇమేజెస్ లను షేర్ చేస్తున్నారు.
ప్రస్తుతం పవన్ రీమిక్స్ సినిమాలు చేస్తున్నారని అభిమానులు కూడా ఫైర్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో నాగబాబు ఇలా మాట్లాడడంతో మరింత గా కామెంట్స్ చేస్తున్నారు. నాగబాబు నోటి దూల నుంచి ఇలాంటిదే మరొక అనుముత్యం కూడా వచ్చింది. అత్యధికంగా డబ్బు సంపాదించిన హీరోలలో పవన్ కళ్యాణ్ మొదటి స్థానం అని ఇప్పుడు ఆ హీరో చేతిలో కేవలం ఒక్క రూపాయి కూడా లేదని తెలియజేశారు. ఒకానొక సమయంలో భారీగా సంపాదించిన పవన్ కళ్యాణ్ ఆదే హీరో చేతిలో ఒక్క రూపాయి కూడా లేదని కామెంట్లు చేశారు. దీంతో నాగబాబు, పవన్ పైన మరొక సారి ట్రోలింగ్‌కు కారణమవుతోంది. ముఖ్యంగా పవన్ ను ప్యాకేజీ ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. ఇక అభిమానులు మాత్రం నాగబాబు వల్లే పవన్ కు సగం ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.