బాలీవుడ్లో స్టార్ హీరో గా ఒక వెలుగు వెలుగుతున్న షారుఖ్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎలాంటి పాత్రలోనైనా సరే ఒదిగిపోయి నటిస్తూ ఉంటారు. ముఖ్యంగా తన సినిమా విడుదలవుతోంది అంటే చాలు అభిమానులు పెద్ద ఎత్తున కోలాహలం చేస్తూ ఉంటారు. గడిచిన నాలుగేళ్ల నుంచి ఒక్క సినిమాని కూడా వెండితెర పైన విడుదల చేయలేదు షారుక్ ఖాన్. అంతకుముందు కూడా విడుదల చేసిన సినిమాలన్నీ కూడా అట్టర్ ప్లాప్ గానే నిలిచాయి. దీంతో అభిమానుల సైతం తమ హీరో సినిమా ఎప్పుడు విడుదలవుతుందా అని చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.
ఇలాంటి సందర్భంలోనే పఠాన్ సినిమాతో షారుఖ్ ఖాన్ కం బ్యాక్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తోంది.ఈ సినిమాకి సంబంధించి ఒక పాటను కూడా విడుదల చేశారు. ఈ పాటలో చాలా గ్లామర్ డోస్ ఎక్కువగా ఉండడంతో ఈ పాట యువత బాగా ఆకర్షిస్తోంది. ఈ సినిమాని సిద్ధార్థ ఆనంద్ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. హీరోయిన్గా దీపికాపదుకొనే నటిస్తోంది. ఈ చిత్రంలో కీలకమైన పాత్రలో జాన్ అబ్రహం కూడా నటిస్తూ ఉన్నారు. ఈ చిత్రానికి సంబంధించి గడిచిన కొద్ది రోజుల క్రితం టీజర్ కూడా విడుదల చేయడం జరిగింది.
ఈ సినిమా టీజర్ చూశాక ఈ చిత్రం ఒక థ్రిల్లర్ అండ్ యాక్షన్ చిత్రం అన్నట్లుగా అర్థమయింది అభిమానులకు. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా ఎనిమిది దేశాలలో ముగ్గురు సూపర్ స్టార్ తీస్తున్నారు. యాక్షన్ సీక్వెన్స్ అన్నీ కూడా ఇటలీ , స్పెయిన్ టర్కీ ,ఆఫ్గాన్ ఇతర దేశాలలో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే రెండు రోజుల క్రితం ఒక పాటను విడుదల చేయక ఈ పాటలో షారుక్ తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నారు.
ఈ పాటలో కొన్ని అగ్లీ మూమెంట్స్ అలాగే డర్టీ డ్రెస్సింగ్ కూడా ఉన్నాయని అభిమానులు ఫీల్ అవుతున్నారు. ముఖ్యంగా పెళ్లి అయిన దీపికా పెళ్లి తర్వాత మరింత బోల్డ్ పాత్రలను ఎంచుకుంటోంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. సినిమా అంటే కాస్త ఎక్స్పోజింగ్ ఉండవచ్చు కానీ మరి ఇంత డర్టీ గా మారితే అది మరొక లాగా తయారవుతుందని కామెంట్స్ చేస్తున్నారు. షారుక్, దీపికా పాట చూసిన వారంతా ఒకసారిగా నోరెళ్ళ పెడుతున్నారు. ముఖ్యంగా తెలుగు ఆడియన్స్ కు మాత్రం పెద్దగా ఈ పాట ఆకట్టుకోలేక పోతోంది. అయితే ఇదంతా కేవలం సక్సెస్ కోసమే చేస్తున్నట్లుగా సమాచారం.