మలయాళం చిత్రమైన ప్రేమమ్ సినిమాతో మొదటిసారిగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది నాచురల్ బ్యూటీ సాయి పల్లవి. ఆ తర్వాత తెలుగులో మాత్రం ఫిదా సినిమాతో ఎంట్రీ ఇచ్చి ఎంతోమంది కుర్రకారులను ఆకట్టుకుంది. ఆ వెంటనే వచ్చిన అవకాశాలను చేసి స్టార్ హీరోయిన్ రేంజ్ లో ఎదిగిపోయింది. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ సమయంలోనే తన నటనతో డాన్స్ తో అందంతో ఎంతోమంది కుర్రకారులను ఆకట్టుకున్న సాయి పల్లవి ఈ మధ్యకాలంలో సినిమాలలో అసలు నటించలేదు. చివరిగా ఈమె విరాటపర్వం, గార్గి వంటి చిత్రాలలో నటించింది.
దీంతో స్టార్ హీరోయిన్ రేంజ్ లో ఉన్న ఈ ముద్దుగుమ్మ ఒకసారిగా సినిమాలకు బ్రేక్ చెప్పడంతో ఆమె అభిమానుల సైతం కాస్త నిరుత్సాహ చెందుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గడచిన ఆరు నెలల క్రితం నుంచి సాయి పల్లవి నుంచి ఎలాంటి అప్డేట్ రాలేకపోవడంతో ఆమె సన్నిహితుల వర్గాల నుంచి సాయి పల్లవి సినిమా లు మానేసింది అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఒక చిత్రానికి ఈ ముద్దుగుమ్మ రూ.4 కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ అందుకుంటూ ఉండగా ఇలాంటి సమయంలో ఈమె ఇలాంటి నిర్ణయం తీసుకోవడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.
అయితే గడిచిన కొద్ది రోజుల క్రితం ఒక టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోల చిత్రంలో కీలకమైన పాత్రలో ఆఫర్ రాగా ఆమె సున్నితంగా వాటిని తిరస్కరించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. స్టార్ హీరో మాట్లాడినప్పటికీ దయచేసి సినిమాలు మీద ఒత్తిడి చేయొద్దండి అంటూ నెమ్మదిగానే ఆ సినిమా నుంచి జారుకున్నట్లు తెలుస్తోంది. అయితే సాయి పల్లవి అభిమానులు మాత్రం ఆమె సినిమాలలో నటించే అవకాశం ఉందా లేదా అనే విషయాన్ని తానే స్వయంగా చెబితే బాగుంటుంది అని పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
అయితే కొంతమంది మాత్రం త్వరలోనే సాయి పల్లవి ఒక హాస్పిటల్ ని ఓపెన్ చేయబోతోంది అంటూ అందుకోసమే సినిమాలు చేయడం లేదంటూ తెలియజేస్తూ ఉన్నారు. కానీ అభిమానులు మాత్రం ఆమెను ఒక హీరోయిన్ గానే చూడాలని కోరుకుంటున్నారు. మరి సాయి పల్లవి అభిమానుల కోరిక మేరకు సినిమాలలో నటిస్తుందో లేదో తెలియాల్సి ఉంది.