టాలీవుడ్ లో ఒకప్పటి నటిగా గుర్తింపు తెచ్చుకున్న వారిలో మనోరమ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. అయితే ఈతరం ప్రేక్షకులకు ఈమె అంతగా తెలియకపోవచ్చు. కానీ అప్పట్లో ఎంతోమంది ప్రేక్షకులకు మనోరమా చాలు ఇట్టే గుర్తు పట్టేస్తారు.ఇక ఈమె తమిళంలో రజినీకాంత్, కమలహాసన్, శివాజీ గణేషన్ వంటి అగ్ర హీరోల సరసన నటించింది. అంతేకాకుండా ఆమె ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలలో నటించి అందరిని మెప్పించింది. మనోరమ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 1500 సినిమాలలో నటించి వెయ్యికి పైగా నాటక ప్రదర్శనలు చేసి కోట్లాదిమంది అభిమానులను సొంతం చేసుకుంది మనోరమ. ఇక ఈమె తెలుగులోనే కాకుండా తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషలలో నటించి ప్రేక్షకాదరణ పొందింది. అంతలా పాపులర్ అయ్యింది మనోరమ.
ఈమె మొదటగా 1958లో తమిళంలో మాలఇట్టా మంగై సినిమాతో మొదట తెర ముందుకు వచ్చింది. ఆ తరువాత మనోరమ అన్ని భాషలలో నటించినప్పటికీ ఎక్కువగా తమిళ భాషలోనే ప్రాముఖ్యత పొందింది. అంతేకాకుండా ఆమెని తమిళ అభిమానులు ఆచి పిలుస్తూ ఉంటారు. ఆ తరువాత ఆమెకు సినిమా అవకాశాలు బాగానే వెళ్ళు పడ్డాయి. దీంతో మనోరమ 1987లో అత్యంత ఎక్కువ సినిమాలలో నటించిన నటిగా గిన్నిస్ బుక్ రికార్డులో కూడా ఎక్కింది.
ఇదిలా ఉంటే తాజాగా మనోరమకి సంబంధించిన కొన్ని విషయాలను సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అసలు విషయంలోకి వెళితే 1996 ఎన్నికల సమయంలో రజినీకాంత్ ఒక పార్టీకి మద్దతు తెలిపినప్పుడు మనోరమ మరో పార్టీకి ప్రచారం చేస్తూ కించపరిచే విధంగా మాట్లాడిందట.దాంతో ఎన్నికల తరువాత ఆమెకు సినిమా అవకాశాలు చేయి జారిపోయాయి. ఈ విషయాన్ని తెలుసుకున్న రజినీకాంత్ తనను అవమానించిన విషయాన్ని పక్కన పెట్టి ఆయన చేసిన అరుణాచలం సినిమాలో అవకాశం ఇచ్చాడట.ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వటం వలన రజనీకాంత్ అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. ముఖ్యంగా ఎలాంటి వారినైనా సరే క్షమించే మంచి గుణం మా హీరోకి ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు.. నిన్నటి రోజున రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా జైలర్ సినిమా నుంచి టీజర్ విడుదల అయింది. ఈ టీజర్ లో మరొకసారి యాంగ్రీ యంగ్ లుక్ లో కనిపిస్తున్నారు రజనీకాంత్. మరిసారైనా రజినీకాంత్ సక్సెస్ అందుకుంటారేమో చూడాలి.