టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా పేరు పొందారు రామానాయుడు. రామానాయుడు ప్రొడ్యూసర్ గా ఎన్నో చిత్రాలు నిర్మించి మంచి మెజారిటీ హిట్ సినిమాలను అందుకున్నారు. ప్రముఖ దర్శకుడు చంద్ర మహేష్ మాట్లాడుతూ తాను శివయ్య సినిమాకు పనిచేస్తున్న సమయంలో ఆ సినిమా హిట్ అయితే డైరెక్షన్ చేసే అవకాశం ఇస్తానని తెలియజేశారట.
శివయ్య సినిమా ఒకవేళ ఆడకపోతే నేను సినిమాలు తీయని ఆయన అన్నారని తెలియజేశారు చంద్ర మహేష్. అయితే ఎట్టకేలకు శివయ్య సినిమా విడుదలై మంచి విజయాన్ని అందుకోవడంతో రామానాయుడు గారు తనకు పిలిచి అవకాశం ఇచ్చారని చంద్ర మహేష్ తెలియజేశారు.
అయితే అ లాంటి సమయంలోనే ఒక బెంగాలి చిత్రాన్ని రామానాయుడు గారు చూసి ఆ సినిమా కథ నచ్చడంతో ఆ చిత్రాన్ని రీమేక్ చేయాలని తనని సూచించినట్లుగా తెలియజేశారు చంద్రమోహన్. అయితే ఆ సినిమా కథను పోసాని మారుస్తానని తనకు చెప్పి హామీ ఇచ్చారని తెలియజేశారు. ఆ సినిమాలో కృష్ణ విజయశాంతి లను హీరో హీరోయిన్లుగా ఫిక్స్ చేశామని తెలియజేశారు. ఈ చిత్రానికి టైటిల్ కూడా కృష్ణ గారు అనే టైటిల్ ఫిక్స్ చేశామని చంద్ర మహేష్ తెలియజేయడం జరుగుతోంది. అటు తరువాత మానవుడు దానవుడు సినిమా ఫ్లాప్ కావడంతో ఈ సినిమాను ఆపేశామని చంద్రమోహన్ కామెంట్లు చేయడం జరిగింది.
ఇక ఆ సమయంలో వేరే కథతో సినిమా చేద్దామని రామానాయుడు గారు చెప్పడంతో ప్రేయసి రావే అనే చిత్రాన్ని ప్లాన్ చేశామని తెలియజేశారు మహేష్.. అయితే ఈ సినిమాని మొదట సుమంత్ కు చెప్పగా ఈ సినిమా క్లైమాక్స్ లో నచ్చకపోవడంతో ఈ సినిమాని ఒప్పుకోలేదని తెలిపారు.ఆ తర్వాత శ్రీకాంత్ తమ్ముడితో ప్లాన్ చేశామని అయితే కొన్ని కారణాలవల్ల ఆ చిత్రం సెట్ కాలేదని తెలియజేశారు. కానీ ఈ కథ శ్రీకాంతుకు నచ్చడంతో ఓకే చెప్పారని తెలిపారు.
ఆ తర్వాత రామానాయుడు గారు క్లైమాక్స్ మార్చాలని చెప్పగా నేను ఆయన కాళ్లపై పడిపోయానని చంద్ర మహేష్ తెలియజేశారు. క్లైమాక్స్ షూట్ చేయడానికి నచ్చకపోతే మారుద్దామని చెప్పి బలవంతంగా ఒప్పించి ఆ సినిమాలో ఆ సన్నివేశాన్ని పెట్టానని తెలిపారు.దీంతో ఆ సినిమా సక్సెస్ సాధించింది అని తెలియజేశారు చంద్ర మహేష్.