నటి పవిత్ర లోకేష్ నాలుగో వివాహం చేసుకోబోతోంది అనే విషయం తెలియగానే ఇండస్ట్రీలో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. అంతేకాకుండా ఆమె ప్రస్తుతం నటుడు నరేష్ తో సహజీవనం చేస్తోందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. దీంతో వీరిద్దరు త్వరలోనే వివాహం చేసుకోబోతున్నారు అనే వార్తలు వైరల్ గా మారుతున్నాయి. అయితే వీరిద్దరి పైన జరిగే ట్రోలింగ్ ఆపాలంటూ ఈ జంట పోలీసులను సైతం గతంలో ఆశ్రయించింది. ముఖ్యంగా మార్పిక్ ఫోటోలు, అసభ్య పదాలతో వేధిస్తున్న వారి పైన చర్యలు తీసుకోవాలంటు నరేష్, పవిత్రలోకేష్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. దీంతో కొంతమంది సోషల్ మీడియా వాటికి నోటీసులను కూడా జారీ చేయడం జరిగింది.
తాజాగా నటుడు నరేష్ నాంపల్లి కోర్టును ఆశ్రయించినట్లు సమాచారం. తమను ట్రోలింగ్ చేస్తున్న కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కు కొంతమంది వ్యక్తుల పైన క్రిమినల్ డిఫార్మషన్ వేసినట్లుగా తెలుస్తోంది.దీనిపై విచారించిన కోర్టు పవిత్ర ,నరేష్ ల పైన ట్రోలింగ్ పాల్పడుతున్న పలు యూట్యూబ్ ఛానల్ పైన విచారణ చేపట్టాలని సైబర్ క్రైమ్ పోలీసులకు ఆదేశాలు జారీ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కొద్దిరోజులుగా పవిత్ర, నరేష్ బంధం పైన తీవ్రమైన చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి.
ఇక అంతే కాకుండా కృష్ణ మరణించిన తర్వాత అక్కడికి వచ్చిన పవిత్ర, నరేష్ పైన కూడా ట్రోల్లింగ్ చేయడంతో తాము చాలా బాధపడ్డామని తెలియజేస్తున్నారు. అందుచేతనే కంప్లైంట్ ఇచ్చినట్లుగా తెలియజేయడం జరిగింది. అలాగే ఈ ట్రోల్స్ వెనుక నరేష్ మూడో భార్య రమ్య కూడా ఉన్నట్లు తెలియజేయడం జరిగింది. నరేష్ ఇప్పటివరకు మూడు వివాహాలు చేసుకున్నారు. మూడో భార్యతో మూడేళ్లుగా దూరంగా ఉంటున్నారు నరేష్. రమ్య దీంతో కొందరి దగ్గర అధిక వడ్డీ ఇప్పిస్తానని చెప్పి డబ్బులు వసూలు చేసి మోసం చేయడానికి నరేష్ దూరం పెట్టారు అన్న వార్తలు వినిపించాయి.
అయితే ఈ విషయంపై నరేష్ స్పందిస్తూ.. రమ్య తనకు ఎలాంటి సంబంధం లేదని తామిద్దరం దూరంగా ఉంటున్నామని క్లారిటీ ఇవ్వడం జరిగింది. అయితే ఆ తర్వాత సహనటి అయిన పవిత్ర లోకేష్ తో నరేష్ సహజీవనం చేయడం మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. పవిత్ర లోకేష్ కూడా తన భర్తకి దూరంగా ఉండడంతో వీరిద్దరూ విడాకులు క్లియర్ అయ్యాక ఈ జంట అధికారికంగా వివాహం చేసుకోబోతున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.