టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కెరియర్ ప్రారంభంలో వరుస సక్సెస్ లు అందుకొని.. ఆ తర్వాత వరుస ఫ్లాప్ లు చూసిన ఈయన కెరియర్ విషయంలో ఎన్నో ఇబ్బందులను చూశారు. ముఖ్యంగా అనిల్ సుంకర నిర్మాతగా రాజ్ తరుణ్ తో తెరకెక్కిన మూడు సినిమాలు కూడా ఒక సినిమాను మించీ మరొకటి ఫ్లాప్ గా నిలిచాయి. అయితే ఈ మూడు సినిమాలతో రాజ్ తరుణ్ కెరియర్ ముగిసిపోయిందంటూ ప్రతి ఒక్కరు చెబుతున్నారు. అయితే ఈ మూడు సినిమాలకు ఆయన పారితోషకం కాకుండా విల్లా తీసుకున్నారని.. ఆ విల్లా కోసమే కెరియర్ను నాశనం చేసుకున్నాడు అని ఇండస్ట్రీలో టాక్ వుంది. అంతే కాదు ఆ విల్లా కోసమే రాజ్ తరుణ్ ఇలా మూడు సినిమాలు చేశారా అన్న ప్రశ్న కూడా ఎదురవగా.. ఆ ప్రశ్న గురించి మాట్లాడుతూ అయినా క్లారిటీ ఇచ్చారు.
విల్లా కోసం నేను ఆశపడ్డానని ..జరిగిన ప్రచారంలో నిజం లేదు. మొదట అనిల్ సుంకర బ్యానర్ లో నటించే సమయంలో నాకు ఇలాంటి ఆఫర్ ఇవ్వలేదు.. కొంత పారితోషకం మాత్రమే తీసుకున్నాను అంటూ రాజ్ తరుణ్ వెల్లడించారు.. ఒక సినిమాలో నటించే సమయంలోనే మరో రెండు సినిమాలలో అవకాశం రావడంతో డబ్బు తీసుకోకుండా విల్లా తీసుకుంటే బెస్ట్ అని సూచించారని.. అందుకే నేను విల్లా ను తీసుకున్నాను అని రాజ్ తరుణ్ తెలిపారు. ప్రస్తుతం ఆ విల్లా లోనే తాను ఉంటున్నట్లుగా కూడా రాజ్ తరుణ్ కామెంట్లు చేశారు.
అలాగే నేను ఎంచుకునే స్క్రిప్టుల విషయంలో రాజా రవీంద్ర పాత్ర ఉండదని.. ఇద్దరం కలిసి కథలు వినే సమయంలో రాజా రవీంద్ర సైలెంట్ గానే ఉంటారు అని రాజు తరుణ్ తన అభిప్రాయాలను చెప్పుకొచ్చారు. ఏదైనా కథ నచ్చితే ఆ కథను బెటర్ చేయడానికి రాజా రవీంద్ర సలహాలు ఇస్తారని ఆయన కామెంట్లు చేశారు. ఇటీవల అహ నా పెళ్లంట వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ సాంతం చేసుకున్నారు. ఇప్పుడు ఇంకొన్ని ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు.