టాలీవుడ్ లో అతి తక్కువ సమయంలో భారీ క్రేజ్ సంపాదించిన యువ హీరో ఎవరు అంటే రౌడీ హీరో విజయ్ దేవరకొండ అని చెప్పవచ్చు. అర్జున్ రెడ్డి సినిమా తోనే ఓవర్ నైట్ స్టార్ హీరోగా మారిపోయాడు విజయ్. ఆ తర్వాత వచ్చిన సినిమా ఫలితాల అనంతరం పాన్ ఇండియా లెవల్లో సినిమాలను నిర్మించే స్థాయికి ఎదిగాడు. ఇక ఈయనకు అభిమానులు కూడా ఎక్కువగా పెరిగి పోయారు అని చెప్పవచ్చు.
సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు విజయ్. ఇక తనకు సంబంధించి ఎలాంటి మెసేజ్, ఫోటోలు పెట్టినా కూడా క్షణాలలో లక్షల్లో వ్యూస్ , కామెంట్లు చేస్తూ ఉన్నారు నెటిజన్స్. అంతలా ఇతని పేరు సంపాదించుకున్నాడు. అయితే తాజాగా విజయ్ దేవరకొండ ఇంస్టాగ్రామ్ లో ఫాలో అవుతున్న వారి సంఖ్య..14 మిలియన్ లకు పైగా చేరుకుంది. అయితే ఈ విషయాన్ని విజయ్దేవరకొండ పెద్దగా పట్టించుకోకపోయినా ఆయన ఫ్యాన్స్ మాత్రం సోషల్ మీడియాలో ఈ విషయాన్ని బాగా షేర్ చేస్తూ వైరల్ గా మార్చారు.
విజయ్ ప్రస్తుతం లైగర్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానున్నట్లు సమాచారం.