సీనియర్ హీరో కమల్ హాసన్.. కరోనా బారిన పడి పూర్తిగా కోలుకున్నారు. మళ్లీ సెట్స్ పైకి వచ్చి గ్యాప్ లేకుండా షూటింగ్లో పాల్గొనడానికి ఫుల్ డేట్స్ కేటాయించాడు హీరో కమల్ హాసన్. తాజాగా కమల్ హాసన్ నటిస్తున్న సినిమా విక్రమ్. ఈ సినిమా షూటింగ్ చాలా వేగంగా జరుపుకుంటోంది. అయితే హాసన్ కూతురు అయినటువంటి శృతిహాసన్.. కరోనా మారితే కొన్ని వాక్యాలను తెలియజేసింది.
కరోనా మహమ్మారి ఇంకా పూర్తిగా తగ్గలేదు. కాబట్టి అందరూ ఈ వైరస్ను చాలా తేలికగా తీసుకోవద్దు అంటూ శృతిహాసన్ హెచ్చరిస్తోంది. కరొనా కి సరైన చికిత్స తీసుకోవడం చాలా అవసరమని తెలియజేసింది. తన తండ్రి త్వరగా కోలుకునేందుకు మేము చాలా హ్యాపీగా ఫీలయ్యాము.. కరోనా కారణంగా ఎంతోమంది స్నేహితులను కోల్పోయాను అని తెలియజేసింది. ఆ సమయంలో నేను చాలా బాధపడ్డాను.. అందుచేతనే మనం జాగ్రత్తగా ఉండాలి, అందరూ కచ్చితంగా వ్యాక్సిన్ వంటి టీకాలు వేయించుకోవటం చాలా మంచిదని తెలియజేస్తోంది శృతిహాసన్. ఏది ఏమైనా కమలహాసన్ బయటపడడం సినీ ఇండస్ట్రీకి కాస్త ఊపిరి పీల్చుకుందని చెప్పవచ్చు.