నాగ శౌర్య హీరోగా డైరక్టర్ వీరేంద్ర సంతోష్ జాగర్లమూడి తో కలసి తెరకెక్కించిన చిత్రం లక్ష్య ఈ సినిమా ఒకస్పోర్ట్స్ డ్రామా గా ఈ సినిమా తెరకెక్కించడం జరిగింది. ఇక ఈ సినిమా థియేటర్లలో విడుదలై పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. శ్రీ వెంకటేశ్వర సీనిమాస్ మరియు నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై.. ఈ సినిమాని తెరకెక్కించడం జరిగింది. ఈ సినిమాకి కాలభైరవ సంగీతం అందించారు.
తాజాగా ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 7వ తేదీన ఆహా లో ప్రసారం కానున్నట్లు తెలుస్తోంది. ఇందులో కేతిక శర్మ హీరోయిన్ గా నటించింది. ఇక ఈ సినిమాలో జగపతి బాబు, సచిన్. ఖేదేకర్ లు కీలక పాత్రలో నటించడం జరిగింది. అయితే ఈ సినిమా థియేటర్లలో కాస్త నిరాశ పరిచిన.. బుల్లితెర పైన అలరిస్తుంది ఏమో వేచి చూడాల్సిందే..