ఉప్పెన సినిమాతో ఓవర్‌నైట్ కే స్టార్డమ్ సంపాదించుకుంది హీరోయిన్ కృతి శెట్టి. ఇక ఆ తర్వాత వరుస ఛాన్స్ లను కొట్టేసింది ఈ ముద్దుగుమ్మ. కృతి శెట్టి తన అందంతో అభినయంతో దర్శక నిర్మాతలను బాగా ఆకర్షిస్తుంది. దీంతో ఏకంగా నాచురల్ స్టార్ నాని తో నటించే అవకాశాన్ని దక్కించుకుంది.. నాని హీరోగా రాహుల్ సాంకృత్యాన్ డైరెక్షన్లో తెరకెక్కిన చిత్రం శ్యామ్ సింగరాయ్. ఇక ఈ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్‌ను అందుకుంది.
శ్యామ్ సింగరాయ్ లో కీర్తి అనే డిఫరెంట్ క్యారెక్టర్ లో నటించింది కృతి శెట్టి. అంతే కాకుండా ఏకంగా సిగరెట్ తాగుతూ కనిపించింది ఈ ముద్దుగుమ్మ. తనకు స్మోకింగ్ అంటే అస్సలు నచ్చదట. కానీ పాత్ర కోసం అదే ఛాలెంజ్‌గా తీసుకొని సిగరెట్ తాగే సన్నివేశాన్ని తెరకెక్కించబడిందని తెలియజేసింది. ఈ సన్నివేశం కోసం ఆమె మూడు రోజులపాటు సిగరెట్ ఫ్యాక్టరీ చేసినట్లు సమాచారం. ఇక ఈ సినిమా చేస్తున్నప్పుడు ఆ సీన్ వచ్చినప్పుడు ఆమె చేతులు వణికిపోయాయని చెప్పుకొచ్చింది కృతి శెట్టి.