సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన కెరీర్‌లోనే ల్యాండ్‌మార్క్ 25వ చిత్రంలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా ఈ సినిమాకు సంబంధించిన ఎలాంటి అప్‌డేట్ వచ్చినా జనాలు ఆసక్తిగా చూస్తున్నారు. కాగా దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ విషయంలో ఇప్పుడు ఒక ఆసక్తికరమైన వార్త ఇండస్ట్రీలో హల్‌చల్ చేస్తోంది.
మహేష్ 25వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన టైటిల్‌పై చిత్ర యూనిట్ ఒక క్లూ ఇచ్చారు. మహేష్ పుట్టినరోజు సందర్భంగా ఆగష్టు 9న ఈ టైటిల్‌ను రిలీజ్ చేయబోతున్నట్లు వారు ప్రకటించారు. ఇందులో ఇంగ్లీష్ పదాలు ‘‘R I S’’ అనేవి వచ్చే విధంగా వారు మహేష్‌ను పొగిడారు. అయితే ఈ అక్షరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తే ఇది హీరో పేరులోనివి అని మనకు తెలుస్తోంది. దీనిబట్టి ఈ సినిమాలో మహేష్ పేరుతో పాటు సినిమా టైటిల్ కూడా ‘‘రిషి’’ అని జనాలు అంటున్నారు.
ఇక ఈ విషయం తెలుసుకున్న మహేష్ ఫ్యాన్స్ ఈ టైటిల్‌ను సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ చేస్తున్నారు. మరి ఈ సినిమాకు రిషి అనే టైటిల్‌ను చిత్ర యూనిట్ నిజంగానే ఫిక్స్ చేశారా అనే విషయం తెలియాలంటే మాత్రం ఆగష్టు 9 వరకు ఆగాల్సిందే. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోండగా అశ్విని దత్, దిల్ రాజు, పివిపి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ఏప్రిల్ 5, 2019లో రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు చిత్ర యూనిట్.