హీరో వరుణ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం గని. తన కెరీర్లో ఎప్పుడూ విభిన్నమైన కథలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు ఈ యువ హీరో. అయితే తాజాగా ఈ సినిమా డిసెంబర్ 24వ తేదీన విడుదల కావాల్సి ఉండగా.. చివరి నిమిషంలో వాయిదా పడినట్లు తెలిసింది. అయితే ఈ సినిమాకు సంబంధించి సరికొత్త విడుదల తేదీపై చిత్రబృందం క్లారిటీ ఇవ్వాల్సి ఉండగా తాజాగా ఒక పోస్టర్ ద్వారా ఆ విడుదల తేదీని ప్రకటించడం జరిగింది.
వరుణ్ తేజ్ సినీ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి ఏడు సంవత్సరాలు పూర్తి కావడం విశేషం. డిసెంబర్ 25వ తేదీన ఉదయం 10 గంటలకు గణేష్ చిత్రం విడుదల తేదీని చిత్ర బృందం వెల్లడించడం జరిగింది. ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 18న విడుదల అవుతున్నట్లు చిత్ర బృందం ఒక పోస్టర్ ద్వారా తెలియజేయడం జరిగింది. ఏది ఏమైనా ప్రస్తుతం సినిమాలను ఎక్కువగా పోస్ట్ పోన్ అవుతూనే ఉన్నాయని చెప్పవచ్చు.
Giving you my word…
It's worth the wait..🥊
Wishing you all a Merry Christmas.#Ghani #GhaniOnMarch18th pic.twitter.com/c517lHBAZj— Varun Tej Konidela 🥊 (@IAmVarunTej) December 25, 2021