సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో తాజాగా తెరకెక్కిన చిత్రం పుష్ప. ఈ సినిమాలో రష్మిక మందన నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా విడుదలై ప్రస్తుతం బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ నటనకుగాను పలువురు ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ చిత్ర దర్శకుడు సుకుమార్ తాజాగా తిరుమల తిరుపతి శ్రీవారిని దర్శించుకున్నారు. తాజాగా విఐపి ద్వారా దర్శకుడు సుకుమార్ తో పాటు నిర్మాత నవీన్, నటుడు సునీల్ తో పలువురు శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు పుష్ప చిత్ర బృందాన్ని ఆశీర్వదించి పట్టువస్త్రాలతో సత్కరించారు.ఆ తరువాత రంగనాయకుల మండపంలో శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు.
ఈ సందర్భంగా చిత్ర బృందం మీడియాతో మాట్లాడుతూ పుష్ప సినిమా సూపర్ హిట్ అయిన సందర్భంగా శ్రీవారిని దర్శించుకున్న అని చిత్ర యూనిట్ పేర్కొన్నారు. ఈ క్రమంలోనే పుష్ప సినిమా పార్ట్2 ని వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి మొదలుపెడతామని ఈ సందర్భంగా తెలిపారు. ఇక పుష్ప సినిమా టచ్ చేసి పార్టీని తాజాగా తిరుపతి లో నిర్వహించిన విషయం తెలిసిందే. సుకుమార్ తెరకెక్కించిన పాన్ ఇండియా సినిమా పుష్ప ను మైత్రి మూవీ మేకర్స్ ఈ సంస్థ నిర్మించింది. మొదట ఈ సినిమాపై నెగెటివ్ టాక్ వినిపించినప్పటికీ ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.